V6 News

అయ్యో పాపం.... ఎన్నికల డ్యూటీకి వెళ్లిన అంగన్ వాడీ టీచర్ మృతి.. ఖమ్మం జిల్లాలో ఘటన

అయ్యో పాపం.... ఎన్నికల డ్యూటీకి వెళ్లిన అంగన్ వాడీ టీచర్ మృతి.. ఖమ్మం జిల్లాలో ఘటన

కారేపల్లి, వెలుగు: ఎన్నికల డ్యూటీకి వెళ్లిన అంగన్వాడీ టీచర్ చికిత్సపొందుతూ మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కారేపల్లి మండలం బాజుమల్లాయిగూడెం అంగన్వాడీ కేంద్రం టీచర్ వనపట్ల విజయ కుమారి(51)కు తొలి విడత పంచాయతీ ఎన్నికల డ్యూటీ కొనిజర్ల మండలంలో వేయగా.. ఈనెల10న అక్కడికి వెళ్లింది.  

గురువారం పోలింగ్ విధులకు హాజరయ్యే ముందు ఆమె స్పృహ తప్పి కింద పడిపోవడంతో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మృతురాలికి భర్త, కుమార్తె ఉన్నారు. ఎన్నికల విధులకు వెళ్లి అనారోగ్యానికి గురై చనిపోయిన అంగన్వాడీ టీచర్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బంధువులు జీపీ ఆఫీసు వద్ద ఆందోళన చేశారు.