మార్కెట్లో పట్టు కోసం ఈవీ టూ వీలర్​ కంపెనీలు

మార్కెట్లో పట్టు కోసం ఈవీ టూ వీలర్​ కంపెనీలు

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్​ టూ వీలర్​ కంపెనీలు డబ్బు కోసం గ్లోబల్​ ప్రైవేటు ఈక్విటీ కంపెనీల వైపు చూస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఈ మార్కెట్లో పట్టు సాధించడానికి పోటీపడేందుకు ఫండ్స్​ సేకరించాలని ప్లాన్​ చేస్తున్నాయి. ఈవీ కంపెనీలే కాకుండా, యాన్సిలరీలూ ఇదే ప్రయత్నాలు సాగిస్తున్నాయి. రాబోయే కాలంలో ఈ కంపెనీలు ప్రైవేట్​ ఈక్విటీ కంపెనీల నుంచి 1.5 నుంచి 2 బిలియన్​ డాలర్ల దాకా డబ్బు సమీకరించనున్నట్లు ఇన్వెస్ట్​మెంట్​ బ్యాంకర్లు, ఆయా కంపెనీల ఫౌండర్లు చెబుతున్నారు. హీరో ఎలక్ట్రిక్​, ఆథర్​ ఎనర్జీ, ప్యూర్​ ఈవీ, సింపుల్​ ఎనర్జీ, టీవీఎస్​ మోటార్​, ఓబెన్​ వంటి కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. పెద్ద కంపెనీలు 100 నుంచి 250 మిలియన్​ డాలర్ల ఫండింగ్​ కోరుకుంటుంటే, చిన్న కంపెనీలు 30 నుంచి 60 మిలియన్​ డాలర్ల ఫండింగ్​ కోసం చూస్తున్నాయని ఆ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం మార్కెట్​ సైజులో ఈవీల వాటా ప్రస్తుతం 4 శాతానికి పెరిగింది. దీంతో ఈవీ టూ వీలర్​ తయారీదారులు తమ యూనిట్ల కెపాసిటీ పెంచే ఆలోచనలు చేస్తున్నారు. దీంతోపాటు డీలర్ల నెట్​వర్క్​ పెంచుకోవాలనుకుంటున్నారు.