ఎదురులేని ఈవీ మార్కెట్​

ఎదురులేని ఈవీ మార్కెట్​

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్​ టూవీలర్లకు దేశమంతటా ఆదరణ పెరుగుతున్నది. మనదేశంలో ఈ ఏడాది దాదాపు 10 లక్షల   ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్ముడవుతాయని అంచనా. ఇది గత 15 సంవత్సరాల్లో   అమ్మిన యూనిట్లకు ఇది సమానం! గత కొన్ని సంవత్సరాల్లో ఎలక్ట్రిక్ టూవీలర్ వెహికల్స్ సేల్స్ బాగా పెరుగుతున్నాయని సొసైటీ ఆఫ్ మాన్యుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఎస్ఎంఈవీ) గురువారం తెలిపింది.  2021లో, దేశంలో ఎలక్ట్రిక్ టూవీలర్ వెహికల్స్ (ఈ2డబ్ల్యూఎస్​లు) అమ్మకాలు 2020లో 1,00,736 యూనిట్లు కాగా, 2021 రెండు రెట్లు పెరిగి 2,33,971 యూనిట్లకు చేరాయి.
"మొత్తంగా చూస్తే ఈవీల ప్రయాణం బాగుంది. గత కొన్ని నెలలుగా అమ్మకాలు ఊపందుకున్నాయి. గత 15 సంవత్సరాలలో మొత్తం పది లక్షల వరకు ఎలక్ట్రిక్ వెహికల్స్​ను అమ్మాం. 2022లో పది లక్షల యూనిట్లను అమ్మే అవకాశం ఉంది" అని ఎస్ఎంఈవీ డైరెక్టర్ జనరల్ సోహిందర్ గిల్ తెలిపారు.
 

‘ఫేమ్’తో ఎంతో మేలు...

ఫేమ్ 2 ద్వారా ఈవీ పాలసీలో ఇటీవల మరిన్ని సానుకూల మార్పులు రావడంతో ఇండస్ట్రీకి ఎంతో మేలు జరుగుతోంది.  "ఖరీదైన పెట్రో ప్రొడక్టులపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. క్లీన్ ఎనర్జీ వాడకాన్ని పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న మంచి ఆలోచన ఇది" అని గిల్​ తెలిపారు. తగ్గుతున్న ధరలు, తక్కువ రన్నింగ్ కాస్టులు, లో మెయింటనెన్స్ కారణంగా కస్టమర్లు పెట్రోల్ టూవీలర్ల నుండి ఎలక్ట్రిక్ వెహికల్స్​కు పెద్ద సంఖ్యలో మారడం ప్రారంభించారని పేర్కొన్నారు.  ఇప్పటి ట్రెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను పరిశీలిస్తే, వచ్చే 12 నెలల్లో గత 12 నెలల కంటే ఐదు నుంచి ఆరు రెట్లు గ్రోత్ కనిపించవచ్చని ఆయన తెలిపారు. ఎస్ఎంఈవీ లెక్కల ప్రకారం, హై-స్పీడ్ ఎలక్ట్రిక్ టూవీలర్ వెహికల్స్ (ఈ2డబ్ల్యూఎస్)  గంటకు 25 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్తాయి. వీటికి లైసెన్స్ తప్పనిసరి. హైస్పీడ్​ ఎలక్ట్రిక్​ టూవీలర్ల అమ్మకాలు 2020లో 27,206 యూనిట్లతో పోలిస్తే అమ్మకాలు 425 శాతం పెరిగి గత ఏడాది 1,42,829 యూనిట్లకు చేరుకున్నాయి. లోస్పీడ్​ వేరియంట్ల అమ్మకాలను గమనిస్తే 2020లో 73,529 యూనిట్లు కాగా, గత ఏడాది 24 శాతం పెరిగి 91,142 యూనిట్లకు ఎగిశాయి. వీటి అమ్మకాలు 2021 చివరి రెండు క్వార్టర్లలో తగ్గాయి.  అక్టోబర్–-డిసెంబర్ క్వార్టర్లో  మార్కెట్ వాటా 15 శాతం కంటే తక్కువకు పడిపోయింది. లోస్పీడ్ ఈ2డబ్ల్యూలకు ఫేమ్ 2 కింద సబ్సిడీలు రావడం లేదు. బ్యాటరీ కెపాసిటీలో ఒక్కో కిలోవాట్ అవర్​వరకు రూ.15 వేల వరకు హై-స్పీడ్ బైక్‌‌‌‌‌‌‌‌లకు రాయితీలు ఇస్తారు.

ఎంట్రీ-లెవల్ హై-స్పీడ్ ఈ2డబ్ల్యూల రేట్లు లోస్పీడ్​ఈ2డబ్ల్యూఎస్​ల కంటే చాలా తక్కువ. రాబోయే రెండు మూడు సంవత్సరాలలో మనదేశంలోని అన్ని పెద్ద కంపెనీలు ఈ–-స్కూటర్లు, ఈ–-మోటార్ సైకిల్స్,  ఈ–-సైకిల్స్  తయారు చేస్తాయని గిల్ చెప్పారు. రాబోయే ఐదు సంవత్సరాలలో, టూవీలర్ వెహికల్స్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో ఈవీల వాటా 30 శాతానికి పెరుగుతుందని అన్నారు. ఎస్ఎంఈవీ వాహన్ డేటా ప్రకారం, 2021లో 46,214 యూనిట్ల హైస్పీడ్​ ఈ2డబ్ల్యూ అమ్మకాల ద్వారా హీరో మొదటి స్థానంలో ఉంది. తర్వాత 29,868 యూనిట్లతో ఒకినావా రెండోస్థానంలో నిలిచింది. ఎథర్ 15,836 యూనిట్లు, ఆంపియర్ 12,417 యూనిట్లు,  ప్యూర్ ఈవీ 10,946 యూనిట్లను అమ్మాయి.