పెద్ద ప్రమాదమే తప్పింది.. సంగారెడ్డి జిల్లాలో స్కూల్ బస్ పైన తెగిపడ్డ కరెంటు వైర్లు.. బస్సులో 25 మంది చిన్నారులు

పెద్ద ప్రమాదమే తప్పింది.. సంగారెడ్డి జిల్లాలో స్కూల్ బస్ పైన తెగిపడ్డ కరెంటు వైర్లు.. బస్సులో 25 మంది చిన్నారులు

సంగారెడ్డి జిల్లాలో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రైవేట్ స్కూల్ బస్సుపైన కరెంటు తీగలు తెగిపడిన ఘటన కలకలం రేపింది. తీగలు తెగిపడిన సమయంలో కరెంటు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. శనివారం (అక్టోబర్ 25) జరిగిన ఈ ఇన్సిడెంట్ లో తృటిలో ప్రమాదం తప్పిందని స్కూల్ బస్సు డ్రైవర్ తెలిపాడు.

సదాశివపేటలో 25 మిది చిన్నారులతో వెళ్తున్న బస్సుపై సడెన్ గా కరెంటు తీగ తెగిపడింది. అక్కడే ఉన్న స్థానికులు కేకలు వేయడంతో బస్సును ఆపాడు డ్రైవర్, కరెంటు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో విద్యార్థులతో పాటు ఒక క్లీనర్ కూడా ఉన్నాడు. 

ఇటీవల కురిసిన వర్షాలకు వైర్లు దెబ్బతిన్నాయని.. అందుకే తెగిపడుతున్నాయని స్థానికులు తెలిపారు. విద్యుత్ అధికారులు ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని కోరుతున్నారు