బిల్లులు కట్టలేదని తండాకు కరెంట్ కట్ చేసిన్రు

బిల్లులు కట్టలేదని తండాకు కరెంట్ కట్ చేసిన్రు

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం రేణ్యాతండాలో బిల్లులు కట్టలేదని  విద్యుత్ అధికారులు కరెంట్ నిలిపివేశారు. దీంతో    నాలుగు రోజులుగా తండా వాసులు అంధకారంలోనే గడుపుతున్నారు. తండా వాసులు రాత్రి పూట నానా అవస్థలు పడుతున్నారు.   కిరోసిన్ దీపాలు వెలిగించి పనులు చేసుకుంటున్నారు. సమయం ఇస్తే కరెంట్ బిల్లులు కడతామని చెబుతున్నా అధికారులు వినిపించుకోవడం లేదని గిరిజనులు చెబుతున్నారు. ఏజెన్సీలో  అధిరారుల పెత్తనం ఏంటంటూ  ఆగ్రహం వ్యక్తం చేశారు.