
హిమాచల్ ప్రదేశ్ విద్యుత్ శాఖ.. రోడ్డు పక్కన టీకొట్ట నడుపుకునే వ్యాపారికి చుక్కులు చూపింపించింది. టీ కొట్టు వ్యాపారికి ఏకంగా రూ. 55 లక్షల బిల్లును పంపించింది. ఉనా జిల్లాలోని హరోలి ప్రాంతంలో టీ కొట్టు నడుపుకునే నరేష్ కుమార్కు నాలుగు నెలల కాలానికి గాను 6,500 రూపాయల కరెంట్ బిల్లు వచ్చింది. అయితే ఆ బకాయిలు చెల్లించకపోవడంతో అతని కరెంట్ కనెక్షన్ను కట్ చేశారు విద్యుత్ అధికారులు. ఆ బకాయి కట్టి కరెంట్ తెచ్చుకుందామని భావించిన నరేష్ కుమార్ ఆన్లైన్లో చెక్ చేయడంతో రూ.55 లక్షల కరెంట్ బిల్ చూపించింది. బిల్ చూసిన షాక్ గురైన నరేష్ కుమార్ విద్యుత్ అధికారులను ఆశ్రయించగా....పొరపాటున పడిందని, సరి చేస్తామని చెప్పి పంపించేశారు.