V6 News

దేశంలో విద్యుత్‌‌ డిమాండ్‌‌ చరిత్రలోనే అత్యధిక స్థాయికి..

దేశంలో విద్యుత్‌‌ డిమాండ్‌‌ చరిత్రలోనే అత్యధిక స్థాయికి..

న్యూఢిల్లీ: దేశంలో శనివారం విద్యుత్‌‌ డిమాండ్‌‌ చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరింది. హీట్‌‌వేవ్స్‌‌ తీవ్రత పెరగడంతో ఎయిర్‌‌ కండీషనర్లు, డెజర్ట్‌‌ కూలర్లు వంటి కూలింగ్ డివైజ్‌‌ల వినియోగం పెరిగింది. దీంతో శనివారం (ఏప్రిల్‌‌ 25) మధ్యాహ్నం 3:38 గంటలకు 256.11 గిగావాట్ల గరిష్ట డిమాండ్‌‌ నమోదైంది. ఈ నెల 24న మధ్యాహ్నం 3:48 గంటలకు 252.07 గిగావాట్లు డిమాండ్‌‌ రికార్డయ్యింది.