ఏనుగుకు దురదేసింది..కారు తుక్కు తుక్కు అయింది..

ఏనుగుకు దురదేసింది..కారు తుక్కు తుక్కు అయింది..

జంతువులు చేసే పనులు చూస్తే కొన్నిసార్లు భయమేసినా..మరి కొన్ని సార్లు నవ్వుని తెప్పిస్తాయి. వాటి చేష్టలు చూస్తే..కొన్ని సార్లు ముచ్చటేస్తుంది. అయితే అడవిలో ఓ ఏనుగు చేసిన పనికి..నవ్వాలో..పాపం అనాలో తెలియని పరిస్థితి.  

ఏనుగుకు దురద ఏం చేసిందంటే..
అడవిలో ఓ ఏనుగు రోడ్డు దాటుతోంది. ఏనుగు దాటడాన్ని గమనించిన కారు డ్రైవర్..అది పోయేదాక కదలకుండా రోడ్డుపైనే కారును ఆపాడు. అయితే ఇంతలో ఏనుగుకు దురద పుట్టినట్లు ఉంది. మనుషులం కనుక..చేతులతో మనం గోక్కుంటాం..కానీ..ఏనుగు గోక్కేలేదు కదా..అందుకే..కారుతో గోక్కునేందుకు ప్రయత్నించింది. దురద పోగొట్టుకునేందుకు కారును నానా రకాలుగా ఉపయోగించుకుంది. టైర్తో గోక్కున్న ఏనుగు..ఆ తర్వాత కారు ముందు భాగంలోకి వెళ్లి తన వెనుక భాగాన్ని గోక్కునే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత ఏకంగా కారుపైకి ఎక్కింది. దీంతో కారు ముందుభాగం ధ్వంసం అయింది. అయితే ఈ సమయంలో కారులో ఉన్న వాళ్ల పరిస్థితి వర్ణణాతీతం. ఏనుగు ఉన్నంత సేపు వాళ్లు కిక్కురుమనకుండా కూర్చున్నారు. అయితే గోక్కోవడం తప్ప ఏనుగు ఎలాంటి దాడి చేయకపోవంతో..కారులో ఉన్నవారు ఊపిరి పీల్చుకున్నారు. 


 
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ట్విటర్‌లో బ్యూటెంగెబిడెన్ అనే వ్యక్తం షేర్ చేశాడు. ఈ వీడియో 2.3 మిలియన్లకు పైగా జనాలు వీక్షించారు. 46,000 కంటే ఎక్కువ లైక్స్ వచ్చాయి. కొందరైతే...వీడియోను షేర్ చేస్తూ..ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. "నువ్వు దురదగా ఉండి ఏనుగు అయినప్పుడు ఏమి చేస్తావు? అంటూ కామెంట్స్ ఇస్తున్నారు. 

ఏనుగు పిల్లకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత..
కోయంబత్తూర్‌ సత్యమంగళం ప్రాంతంలో ఓ ఏనుగుల గుంపు రోడ్డుపై వెళ్తోంది. అయితే ఆ ఏనుగుల మధ్యలో ఓ పిల్ల ఏనుగు దర్జాగా నడుచుకుంటూ వెళ్తోంది. గుంపులో నుంచి పిల్ల ఏనుగు బయటకు వచ్చినప్పుడల్లా..పెద్ద ఏనుగులు దాన్ని కవర్ చేసుకుంటూ నడుస్తున్నాయి. ఈ ఇంట్రస్టింగ్ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.  ఈ ప్రపంచంలో ఎవ‌రూ కూడా అంత భద్రత క‌ల్పించ‌లేరు. అది కేవ‌లం ఏనుగుల గుంపునకే సాధ్యమైంది. అప్పుడే పుట్టిన పిల్ల ఏనుగుకు మిగ‌తా ఏనుగులు జెడ్ ప్లస్, ప్లస్, ప్లస్ కేటగిరి భ‌ద్రత క‌ల్పించాయంటూ నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.