ధర్మపురిలో.. కరెంట్ షాక్ తగిలి ఏనుగు మృతి

ధర్మపురిలో.. కరెంట్ షాక్ తగిలి ఏనుగు మృతి

కుప్పం సరిహద్దు ప్రాంతంలో గల తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఏనుగు కళ్లముందే కరెంట్ షాక్ తగిలి మృతి చెందింది. ధర్మపురి సమీపంలోని అడవుల నుంచి దారి తప్పిన ఏనుగు పంట పొలాల్లోకి వచ్చింది. అది చూసిన స్థానికులు గట్టిగా అరుస్తూ ఏనుగును వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు. వాళ్ల అరుపులకు భయపడ్డ ఏనుగు అడవి దారి పట్టి వెళ్లపోయింది. అంతలోనే పంట చేల రక్షణ కోసం పెట్టిన కరెంట్ తీగల్లో చిక్కుకున్న ఏనుగు విలవిల్లాడుతూ అక్కడికక్కడే చనిపోయింది. 

ఈ మొత్తం ఘటనను స్థానికులు ఫోన్ లో వీడియో తీశారు. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. అక్కడున్న స్థానికులు ఆ ఏనుగు విలవిలాడుతుంటే ఆ హృదయ విదారక ఘటనను చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ఏనుగు మరణ వార్త విన్న అటవీశాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ధర్మపురి జిల్లాలో ఇటీవలే మూడు ఏనుగులు కరెంట్ షాక్ తగిలి చనిపోయాయి. మరో రెండు ఏనుగులు మత్యువు నుంచి తప్పించుకున్నాయి.