పరుపు కోసం ఏనుగు - జూ కీపర్ మధ్య పోరు, ఎవరు గెలిచారు ? 

పరుపు కోసం ఏనుగు - జూ కీపర్ మధ్య పోరు, ఎవరు గెలిచారు ? 

మానవులకు పెంపుడు జంతువులతో చాలాకాలంగా సంబంధం ఉంది. చాలా మంది ఇంట్లో జంతువులను పెంచుకుంటూ.. వాటిని అపురూపంగా చూసుకొంటుంటారు. ఇంట్లో వాటి అల్లరి అంతాఇంత ఉండదు. లెటెస్ట్ గా ఓ పిల్ల ఏనుగు అల్లరికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. పరుపు మీద పడుకోవడానికి దాని కీపర్ తో కొట్లాడుతున్న వీడియో అందరినీ నవ్విస్తోంది. పరుపు మీద పడుకోవడానికి వారిద్దరూ కలియపడుతున్న వీడియో ఆకట్టుకొంటోంది. Dr.Samrat Gowda IFS ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. Hey That's My bed..get up క్యాప్షన్ జత చేశారు. 

ఏనుగులు మనుషులతో చాలా స్నేహపూర్వకంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. ఓ గున్న ఏనుగు కంచెను దాటేందుకు చాలా కష్టపడుతుంది. ఎలాగో దానిని దాటుకుని ముందుకు వస్తుంది. అక్కడ పరుపుపై పడుకున్న జూ కీపర్ ను లేపేందుకు ప్రయత్నిస్తుంటుంది. కానీ..అతను ఏ మాత్రం లేవకుండా పడుకొనేందుకు ట్రై చేశాడు. కానీ.. ఏనుగు ప్రయత్నం మాత్రం వీడలేదు. పరుపుపై పడుకొనేందుకు ప్రయత్నించింది. అతను కాలితో తన్నేందుకు ట్రై చేసింది. ఒకరకంగా.. ఇద్దరూ కలిసి పోరాటం చేసేలాగా వీడియోలో కనిపించింది.

ఈ క్రమంలో... ఏనుగు ఓ చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. చివరకు ఏనుగుతో పరుపును పంచుకోవాలని కీపర్ డిసైడ్ అవుతాడు. దానిపక్కనే పడుకుని..కౌగిలించుకుంటూ.. పడుకొన్నాడు. మానవుడు జంతువుల మధ్య స్నేహం ఇలా ఉంటుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది కామెడీగా కామెంట్స్ చేశారు. అదృష్టవశాత్తు అతనిపై కూర్చొలేదు.. అంటూ ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. కొన్ని సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకొంటోంది. కొంతమంది పదే పదే ఈ వీడియోను చూస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం : -

ఇవాళ కాంగ్రెస్ కీలక సమావేశం..ఆ నిర్ణయాలపై చర్చ

వాట్సాప్ ద్వారా కేసు విచారణ