ఇవాళ కాంగ్రెస్ కీలక సమావేశం..ఆ నిర్ణయాలపై చర్చ

ఇవాళ కాంగ్రెస్ కీలక సమావేశం..ఆ నిర్ణయాలపై చర్చ

చింతన్ శివిర్ సమావేశాలు ముగియడంతో ఆ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలపై దృష్టి సారించింది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగానే ఇవాళ ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయంలో కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, పార్టీ ఇంచార్జులు పాల్గొననున్నారు. చింతన్ శిబిర్ లో తీసుకున్న నిర్ణయాల అమలు, కార్యచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. దేశవ్యాప్తంగా పార్టీలో భారీ మార్పులు చెయ్యాలని ఇప్పటికే సీడబ్ల్యూసి తీర్మానించింది. స్వాతంత్ర్యం వ‌చ్చి 75 ఏళ్ల‌ైన సంద‌ర్భంగా ఆగ‌స్టు 9 నుంచి  ప్ర‌తి జిల్లాలో 75 కిలోమీట‌ర్ల మేర చేపట్టే పాద‌యాత్ర‌  కార్యచరణపై చర్చించే అవకాశవుంది.దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆగస్టు 15 నుంచి నిరుద్యోగులకు మద్దతుగా ఆందోళన చేపట్టడంపై చర్చించనున్నారు. అదేవిధంగా గాంధీ జయంతి సందర్బంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేపట్టనున్న పాదయాత్రకు సంబంధించిన కార్యచరణపై చర్చించనున్నారు. 

కాగా మూడురోజుల పాటు జరిగిన చింతన్ శివిర్ సమావేశాల్లో పార్టీ బలోపేతానికి సంబంధించి కాంగ్రెస్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పార్టీలో 50 శాతం ప‌ద‌వులు 50 ఏళ్ల‌లోపు వారికే ఇవ్వనున్నారు. ఈ ప‌ద‌వుల్లో ఎస్సీ ,ఎస్టీ, బీసీ, మైనార్టీ, మ‌హిళ‌ల‌కు స‌మాన ప్రధాన్యత ఇచ్చేలా కార్యాచరణను రూపొందించనున్నారు. ఒక కుటుంబానికి ఒక టికెట్ మాత్ర‌మే అని నిర్ణయించిన కాంగ్రెస్ అయిదేళ్లు పార్టీలో క్రియాశీల‌కంగా పనిచేసినవారికి రెండో టికెట్‌ ఇవ్వనుంది. అంతేకాకుండా పార్టీలో కొత్తగా మూడు డిపార్ట్ మెంట్లను ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించారు. ప‌బ్లిక్ ఇన్ సైట్ డిపార్ట్ మెంట్, నేష‌న‌ల్ ట్రైనింగ్ డిపార్ట్‌మెంట్, ఎల‌క్ష‌న్ మెనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌ల ఏర్పాటుపై కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.

 

మరిన్ని వార్తల కోసం

ఇన్వెస్టర్లకు షాక్ ఇచ్చిన ఎల్ఐసీ షేర్ల లిస్టింగ్

8 ఏళ్ల క్రితం ట్వీట్ ను ప్రస్తావిస్తూ మోడీపై కేటీఆర్ సెటైర్లు