8 ఏళ్ల క్రితం ట్వీట్ ను ప్రస్తావిస్తూ మోడీపై కేటీఆర్ సెటైర్లు

8 ఏళ్ల క్రితం ట్వీట్ ను ప్రస్తావిస్తూ మోడీపై కేటీఆర్ సెటైర్లు

కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. 8 ఏళ్ల పాలనపై ఒకరిపై ఒకరు వీలైనప్పుడు ట్విట్టర్లో విమర్శలతో పాటు ప్రశ్నలు సందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీపై మంత్రి కేటీఆర్ మరోసారి సెటైర్లు వేశారు. తెలంగాణ పట్ల కేంద్రప్రభుత్వం పదేపదే వివక్ష చూపుతుందన్న కేటీఆర్.. మోడీ అచ్చే దిన్ హామీపై ట్విట్టర్లో ప్రశ్నించారు.. మోడీ ఏనిమిదేళ్ల పాలనపై ఏం చేశారంటూ ప్రశ్నించారు.

ప్రధాని మోడీ 8 ఏళ్ల క్రితం భారత్ గెలిచింది..ఇది దేశం సాధించిన విజయం అచ్చేదిన్ వస్తున్నాయని  ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తూ ప్రశ్నలు సందించారు. అచ్చేదిన్ హామీ ఇచ్చి 8ఏళ్లు పూర్తయిందన్న కేటీఆర్..అచ్చేదిన్ ఇవేనా అంటూ   ప్రశ్నించారు. మోడీ  ఏనిమిదేళ్ల పాలనలో రూపాయి కనిష్ట స్థాయికి 77.80 చేరిందన్నారు. 45 ఏళ్లలో అత్యధిక నిరుద్యోగం ఉందన్నారు. 30 ఏళ్లలో అత్యధిక ద్రవ్యోల్బణం నమోదయ్యిందన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా LPG ధర పెరిగిందన్నారు. 42 ఏళ్లలో అత్యంత దారుణ స్థితికి ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యిందన్నారు. మీరు చాలా బాగా చేశారు సర్  అంటూ మోడీపై సెటైర్లు వేశారు. ఇలా పదే పదే కేంద్ర ప్రభుత్వ పనితీరు, ప్రధాని మోడీపై విమర్శలు చేస్తున్నారు కేటీఆర్. అమిత్ షా తెలంగాణకు వచ్చినప్పుడు కూడా 27 ప్రశ్నలత ోకేటీఆర్ బహిరంగ లేఖ రాశారు.

 

మరిన్ని వార్తల కోసం...

కర్షకులే నీకు కర్రుకాల్చి వాత పెట్టుడు ఖాయం

టెన్త్ ఎగ్జాం సెంటర్లలో సీసీ కెమెరాలు