అయ్యోపాపం : బావిలో పడిన ఏనుగు.. బయటకు రాలేక అరుపులు

అయ్యోపాపం : బావిలో పడిన ఏనుగు.. బయటకు రాలేక అరుపులు

కేరళలోని ఎర్నాకులంలోని కొత్తమంగళం అటవీ ప్రాంతంలో ఒక ఏనుగు బావిలో చిక్కుకొని నరకం చూసింది. 12గంటల పాటు బావిలో ఉన్న ఏనుగు బయటకు రాలేక అరుపులు పెట్టింది. ఏనుగును బయటకు తీయటంలో అటవీశాఖ సిబ్బంది ఆలస్యం చేయటంతో ఏనుగు తీవ్ర ఇబ్బంది పడింది. ఎర్త్ మూవర్ ఉపయోగించి ఏనుగును బయటకు తీయాలన్న అధికారుల ప్రతిపాదనకు సదరు భూ యజమాని అనుమతి ఇవ్వకపోవటంతో ఆలస్యం అయ్యింది.

ఎట్టకేలకు ఎర్త్ మూవర్ ద్వారా సొరంగాన్ని తవ్విన అటవీశాఖ సిబ్బంది ఏనుగును సురక్షితంగా బయటకు తీశారు. ఫిబ్రవరి నెలలో కూడా మలయత్తూర్లో బావిలో పడిన ఏనుగును ఇలాగే టన్నెల్ తవ్వి బయటికి తీశారు అధికారులు. ఆ సంఘటనను స్ఫూర్తిగా తీసుకొని ఎర్నాకులంలో కూడా అదే పద్దతిని అనుసరించి ఏనుగును రక్షించటంలో సక్సెస్ అయ్యారు. బావిలో నుండి బయటపడాలన్న ప్రయత్నంలో గాయాలపాలైన ఏనుగుకు తగిన చికిత్స అందించి అడవికి తరలించారు అధికారులు.