తిరుమల మాడ వీధుల్లో ఏనుగుల హల్ చల్

 తిరుమల మాడ వీధుల్లో ఏనుగుల హల్ చల్

తిరుమలలో పెను ప్రమాదం తప్పింది.  తిరుమల మాడ వీధుల్లో ఏనుగుల హల్ చల్ చేశాయి.  బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం రాత్రి వేంకటేశ్వర స్వామివారు హంసవాహనంపై సరస్వతీ అలంకారంలో వీణ ధరించి భక్తులకు దర్శనమిచ్చారు. 

ఈ క్రమంలో  గ్యాలరీలో ఉన్న  ఓ భక్తురాలి అరుపులతో  గున్న ఏనుగులు బెదిరాయి.  వెంటనే అప్రమత్తమైన మావటీలు వాటిపైకి ఎక్కి వాటిని  అతి కష్టం మీద అదుపులోకి తీసుకున్నారు. భక్తులను టిటిడి సిబ్బంది దూరంగా పంపింది.  

అనంతరం ఏనుగులను గోశాలకు తరలించారు మావటీలు.   మరోవైపు  తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.