గనిలో చిక్కుకున్న 11 మంది సురక్షితంగా బయటకు..

గనిలో చిక్కుకున్న 11 మంది సురక్షితంగా బయటకు..

2 వారాల తర్వాత వెలికితీసిన చైనా అధికారులు

మరో 11 మంది లోపల్నే..

పేలుడు కారణంగా బంగారు గనిలో చిక్కుకున్న 22 మంది కార్మికులు

బీజింగ్: చైనాలోని బంగారు గనిలో చిక్కుకున్న 11 మంది కార్మికులను రెస్క్యూ టీమ్ లు రెండు వారాల తర్వాత సేఫ్ గా బయటకు తీసుకొచ్చాయి. షాండాంగ్ ప్రావిన్స్ క్విషియా సిటీలోని బంగారు గనిలో ఈ నెల 10న పేలుడు జరిగింది. దీంతో బయటకు వచ్చే మార్గం మూసుకుపోయింది. 22 మంది కార్మికులు 240 మీటర్ల లోతులో చిక్కుకున్నారు. 407 ఎక్విప్ మెంట్స్ తో  633 మంది సభ్యుల రెస్క్యూ టీమ్ సహాయ చర్యలు చేపట్టింది. గనిలో చిక్కుకున్నవారిలో కొందరితో  కాంటాక్ట్ ఏర్పరుచుకుంది. వారికి అవసరమైన ఆహారం, మెడిసిన్స్, బ్లాంకెట్లను సిబ్బంది గనిలోకి పంపించారు. రెండు వారాల తర్వాత 11 మందిని ఆదివారం సేఫ్ గా బయటకు తీసుకొచ్చారు. మిగతావారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని అధికారులు చెప్పారు.  గనిలో 70 టన్నుల శిథిలాలు తొలగించేందుకు మరో 15 రోజులు పడుతుందని తెలిపారు.  చైనాలోని గనుల్లో తరుచూ పేలుళ్లతో ప్రమాదాలు జరుగుతుంటాయి.

ఇవి కూడా చదవండి..

6 రోజుల్లో 10 లక్షలు… ‘‘టీకా’’లో మనదే రికార్డు

ఉత్తరాఖండ్​కు.. ఒక్కరోజు సీఎంగా కాలేజీ అమ్మాయి

చదలవాడ హేమేశ్​కు బాల పురస్కార్