ఫారిన్ మెడికల్ ఎగ్జామ్కు అర్హత సర్టిఫికెట్‌‌‌‌ మస్ట్

ఫారిన్ మెడికల్ ఎగ్జామ్కు అర్హత సర్టిఫికెట్‌‌‌‌ మస్ట్
  • ఉత్తర్వులు జారీ చేసిన ఎన్‌‌‌‌ఎంసీ

హైదరాబాద్,  వెలుగు: డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో జరగనున్న ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్‌‌‌‌ ఎగ్జామినేషన్‌‌‌‌ (ఎఫ్‌‌‌‌ఎంజీఈ)కు ఎలిజిబులిటీ సర్టిఫికెట్‌‌‌‌ తప్పనిసరి అని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌‌‌‌ఎంసీ) ప్రకటించింది. విదేశాల్లో ఎంబీబీఎస్ చేసిన వాళ్లంతా ఎలిజిబులిటీ సర్టిఫికెట్ తీసుకో వాలని చెప్పింది. సర్టిఫికెట్ కోసం జులై 15వ తేదీ లోపు ఎన్‌‌‌‌ఎంసీ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. సర్టిఫికెట్ ఉంటేనే, ఎఫ్‌‌‌‌ఎంజీఈకి దరఖాస్తు చేసుకోవడానికి వీలుంటుందని స్పష్టం చేసింది. ఎఫ్‌‌‌‌ఎంజీఈ పాస్ అయితేనే డాక్టర్‌‌‌‌‌‌‌‌గా గుర్తిస్తారు.