థ్రెడ్ దెబ్బకు.. ట్విట్టర్ రూల్స్ మార్చారు.. మీ ఇష్టమొచ్చినట్లు చూడొచ్చు

థ్రెడ్ దెబ్బకు.. ట్విట్టర్ రూల్స్ మార్చారు.. మీ ఇష్టమొచ్చినట్లు చూడొచ్చు

ఎలన్ మస్క్.. తన ట్విట్టర్ను ఏం చేయాలి అనుకున్నారో ఏమో కానీ.. ఫేస్ బుక్ కొత్తగా తీసుకొచ్చిన థ్రెడ్ దెబ్బకు మాత్రం పాత రూల్స్ లోకి వచ్చేశారు. మొన్నటికి మొన్న ట్విట్టర్ లాగిన్ అయిన తర్వాత మాత్రమే ఇతరుల పోస్టులు చూసే నిబంధన విధించిన ట్విట్టర్.. థ్రెడ్ మార్కెట్ లోకి వచ్చిన కొన్ని గంటల్లోనే.. లాగిన్ లేకుండా ఇతరుల పోస్టులు చూసే అవకాశాన్ని కల్పించారు. థ్రెడ్ రాకతో.. పాత రూల్స్ను మళ్లీ తీసుకురావటం విశేషం.

షరతులు వర్తిస్తాయి..

ట్విట్టర్లో లాగిన్ కాకుండా ఇతరుల పోస్టులను చూసే అవకాశం కల్పించిన ట్విట్టర్..అందుకు కొన్ని షరతులు విధించింది. అయితే కేవలం ఇతరుల మొదటి ట్వీట్ను మాత్రమే చూడవచ్చు. మల్టిపుల్ ట్వీట్స్ను మాత్రం చూడలేరు. 

అధికారిక ప్రకటన చేయలేదు..

ట్విట్టర్ అప్ డేట్ పై అధికారికంగా ప్రకటన వెలువడలేదు. అయితే యూజర్లు లాగిన్ అవకుండా ట్వీట్లను చూశారు. అయితే వినియోగదారులు ట్విట్టర్ లింక్ ఉంటేనే ఇతరుల ట్వీట్లను నేరుగా చూడవచ్చు. వారితో చాట్ చేయాలంటే మాత్రం తప్పనిసరిగా లాగిన్ అవ్వాల్సిందే. 

ట్విట్టర్ లాగిన్ కాని వారు ఇతరుల ట్వీట్లను చూడటంపై ఎలోన్ మస్క్ అనవసర చర్యగా అభివర్ణించారు. ఇది డేటా చోరీకి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. దీని వల్ల యూజర్లు ట్విట్టర్ ఉపయోగించేందుకు ఇబ్బందిపడుతున్నారని..అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని గతంలో పేర్కొన్నారు. 

సమర్థించిన కొత్త సీఈవో..

ట్విట్టర్ లో లాగిన్ కాకుండా ఇతరుల పోస్టులను చూసేందుకు అవకాశం ఇవ్వడాన్ని ట్విట్టర్ సీఈవో లిండా సమర్థించారు. ట్విట్టర్ ను బలోపేతం చేయడానికి ఇది అవసరమన్నారు. ఖాతా లేకుండా ట్వీట్‌లను వీక్షించే సామర్థ్యాన్ని ట్విట్టర్  పునరుద్ధరించినా..మల్టిపుల్ ట్వీట్‌లను యాక్సెస్ చేయడంలో పరిమితులు, దీనిపై అధికారిక ప్రకటన లేకపోవడం వల్ల  ప్లాట్‌ఫారమ్ యొక్క ఉద్దేశాలు మరియు భవిష్యత్తు మార్పుల గురించి వినియోగదారులు ఊహాగానాలు చేస్తున్నారు.