‘కూ’ సహా కొందరు జర్నలిస్ట్ ల అకౌంట్లు ట్విట్టర్ నుంచి తొలగింపు

‘కూ’ సహా కొందరు జర్నలిస్ట్ ల అకౌంట్లు ట్విట్టర్ నుంచి తొలగింపు

భారత మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫామ్ ‘కూ’ ట్విట్టర్ అకౌంట్ ని ట్విట్టర్ నుంచి ఎలన్ మస్క్ తొలగించారు. దీంతో పాటు న్యూయార్క్ టైమ్స్, సీఎన్ ఎన్, వాషింగ్టన్ పోస్ట్ లాంటి మీడియా సంస్థల్లో పని చేస్తున్న జర్నలిస్ట్ ల అకౌంట్లను కూడా ట్విట్టర్ నుంచి తొలగించారు. దీనికి కారణం.. కూ ఇతర సమాచారాన్ని పోస్ట్ చేయడం, జర్నలిస్టులు వాళ్ల వార్తలకు సంబంధించిన లింక్ లను ట్విట్టర్ ద్వారా పంచుకోవడమేనని, ఇవి సురక్షితం కాదని ఎలన్ మస్క్ చెబుతున్నారు.

అయితే, ఈ విషయంపై స్పంధించిన కూ వ్యవస్థాపకులు మయాంక్ బిదావత్కా #ఎలన్ ఈజ్ డిస్ట్రోయింగ్ ట్విట్టర్ అంటూ ట్వీట్ చేశారు. మస్క్ తనకు అనుకూలంగా ఉండేలా ట్విట్టర్ ను మార్చుకుంటున్నారని, తన తీరు ప్రజాస్వామ్య బద్ధంగా లేదని విమర్శించారు. ట్విట్టర్ ఒక ప్రచురణకర్తగా మారిందని, అంతేగానీ, ఓ వేదిక కాదని పేర్కొన్నారు.  

ట్విట్టర్ కి పోటీగా కూ యాప్ ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ట్విట్టర్ లో ఎదురవుతున్న పరిణామాల వల్ల పలు చాలామంది కూ ప్లాట్ ఫామ్ ని ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారు.