నష్టాల భర్తీకి ఉద్యోగాల కోత

నష్టాల భర్తీకి ఉద్యోగాల కోత

ట్విట్టర్ వ్యవహారంలో ఎలన్ మస్క్ రోజుకొక కొత్త నిర్ణయం తీసుకుంటున్నాడు. సంస్థని టేకోవర్ చేసిన వారంలోనే చాలా మార్పులు తీసుకొచ్చాడు. అప్పటినుంచి తీవ్ర విమర్శలు ఎదురుకొంటున్నాడు మస్క్. అయితే, తాజాగా ట్విట్టర్ లో పనిచేస్తున్న 50 శాతం ఉద్యోగులను ఉద్యోగాలనుంచి తీసేస్తున్నట్టు ప్రకటించాడు.  అంటే ప్రపంచ వ్యాప్తంగా 7,500 మంది ట్విట్టర్ లో పనిచేస్తుండగా, వాళ్లలో 3,738 మందిని ఉద్యోగాలనుంచి తీసేయనున్నాడు. దీనికి సంబంధించిన లిస్ట్, మెయిల్స్ ని ఇప్పటికే ఉద్యోగుల జీ మెయిల్ అకౌంట్ కి పంపించాడు.

ట్విట్టర్ ను ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ నిర్ణయానికి కారణం అని చెప్తున్నాడు మస్క్. కంటెంట్ మోడరేషన్ తీసుకురాకపోయినా, మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలకు కొందరు సామాజిక కార్యకర్తలు ప్రకటనదారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. దాంతో ట్విట్టర్ కి యాడ్స్ రావడం ఆగిపోయింది. అలా ట్విట్టర్ రెవెన్యూ రోజుకు 4 మిలియన్ డాలర్లను నష్టపోతోంది. ఈ విషయంపై ఉద్యోగస్తులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, వాళ్లకు నష్ట పరిహారంగా జాబ్ నుంచి తొలగించిన ప్రతీ ఉద్యోగికి మూడు నెలల జీతం ఇస్తున్నారు. చట్ట ప్రకారం ఇవ్వాల్సినదానికన్నా 50 శాతం ఎక్కువే ఇస్తున్నట్టు చెప్తున్నారు.