టెక్నాలజీ : ఇకపై ఎక్స్ చాట్.. వాట్సాప్ టార్గెట్ !

 టెక్నాలజీ : ఇకపై ఎక్స్ చాట్.. వాట్సాప్ టార్గెట్ !

ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న అదిపెద్ద మెసేజింగ్ ప్లాట్​ఫామ్ వాట్సాప్​. దీన్ని రీప్లేస్ చేయడానికి రకరకాల యాప్​లు వచ్చాయి. కానీ, ఏదీ వాట్సాప్​కు సాటి రాలేదు. అయితే ఇప్పుడు ఎలన్ మస్క్​ వాట్సాప్​కు పోటీగా ‘ఎక్స్​ చాట్’ మెసేజింగ్ యాప్ తీసుకురాబోతున్నాడు. ఇప్పటికే ట్విట్టర్​ని ఎక్స్​గా మార్చిన మస్క్, ఈసారి వాట్సాప్​కు బదులు మరో ప్లాట్​ఫాం తీసుకొచ్చేందుకు రెడీ అయ్యాడు. ఎక్స్​ చాట్​ మెసేజింగ్ యాప్​కు సంబంధించి కొత్త ఎన్​క్రిప్టెడ్​ మెసేజింగ్, కాలింగ్ సర్వీస్​లను అందుబాటులోకి తీసుకురానున్నారు.

నిజానికి ఈ ఫీచర్​ ఎక్స్ యూజర్ల కోసం డెవలప్ చేశారు. మెసేజ్ పంపిన కాసేపటికే డిజప్పియర్ అయిపోతుంది. దీని ద్వారా ఎలాంటి ఫైల్స్​ అయినా ఈజీగా షేర్ చేసుకోవచ్చు. వాట్సాప్​లాగానే ఫోన్​ నెంబర్ అవసరం లేకుండా యాక్సెస్ చేయొచ్చు. ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడొచ్చు. యూజర్లకు ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది కలుగదు. వాట్సాప్​ కంటే మరింత సేఫ్టీ ఇస్తుందట!