ఎలన్ మస్క్.. ఎక్స్ Xపై చిలిపి పోస్టు

ఎలన్ మస్క్.. ఎక్స్ Xపై చిలిపి పోస్టు

ఎలన్ మస్క్..వీడు మాములోడు కాదండోయ్. మస్క్లో ఓ బిజినెస్ మ్యానే కాదు..ఓ చిలిపి దొంగ దాగున్నాడు. తనలోని చిలిపితనాన్ని ప్రతిబింబించే ఓ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అయింది. 

ఎలన్ మస్క్ తన  భిన్నమైన ఆలోచనలతో..వేల కోట్లు సంపాదిస్తాడు. విభిన్నమైన నిర్ణయాలతో కోట్లు పోగొట్టుకుంటాడు. ఎంత సంపాదించినా..ఎంత పోగొట్టుకున్నా..మళ్లీ కూల్గా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. అయితే  నిత్యం తన ట్విట్టర్ అకౌంట్లో  ఏదో ఒక పోస్ట్ చేసి జనాన్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాడు. తాజాగా మస్క్లో చిలిపితనం బయటపడింది. తనలోని చిలిపితనాన్ని  మస్క్ ఓ ఫోటో రూపంలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అయింది.

ఎలన్ మస్క్..పోస్ట్ చేసిన ఫోటోలో..ఓ వ్యక్తి కంప్యూటర్ పై తన వర్క్ చేస్తుంటాడు. అయితే ఇంతలో తన భార్య వచ్చి నీ వర్క్ అయిపోయిందిగా..ఇక నీతో ఆడుకుంటా పదా వెళ్తాం అంటూ తనను కౌగిలించుకుని చెప్తూ ఉంటుంది. అందుకు సమాధానంగా ఆ వ్యక్తి..ఆగు ..నేను ట్విట్టర్లో ఒక మీమ్ను పోస్ట్ చేయాలని చెప్తాడు. 

ఈ ఫోటోను వీక్షించిన నెటిజన్లు..మస్క్ మామూలోడు కాడు..వీడికి శృంగార కోరికలున్నాయని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు..ఏయ్ మస్క్..నువ్వు మహా చిలిపి అని కామెంట్ పెడుతున్నారు. ఇంకొందరైతే..యూ నాటీ..అంటూ క్యూట్ కామెంట్ చేస్తున్నారు.