
త్రిబుల్ ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. ఇటీవల ఈ పాటకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. అయితే లేటెస్ట్ గా ఈ పాటను టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మెచ్చారు. ఆమెరికాలోని అభిమానులు టెస్లా కారు లైట్స్ తో నాటు నాటు పాటకు సింక్ అయ్యేలా సూపర్ వీడియో చేశారు. ఇది కాస్త వైరల్ కావడంతో ఎలాన్ మస్క్ ట్విట్టర్ లో స్పందించారు.
ఆర్ఆర్ఆర్ ను ట్యాగ్ చేస్తూ లవ్ సింబల్స్ ను పోస్ట్ చేశారు. దీనిపై ఆర్ఆర్ఆర్ టీమ్ కూడా స్పందిస్తూ లవ్ సింబల్స్ తో మేము మా లవ్ ని పే చేసాము అంటూ ట్వీట్ చేసింది. దీంతో ఇప్పుడిది క్రేజీగా మారింది. సోషల్ మీడియాలో బిజీగా గడిపే మస్క్ సినిమాల విషయాల్లో ఎప్పుడు స్పందించింది లేదు. అలాంటి మస్క్ ఆర్ఆర్ఆర్ కు రిప్లై ఇవ్వడం నెట్టింట క్రేజీగా మారిపోయింది. రాజామౌళి డైరక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించారు.