ప్రపంచ కుబేరుడికి సొంతిల్లు లేదట!

ప్రపంచ కుబేరుడికి సొంతిల్లు లేదట!

వాషింగ్టన్: జీవితంలో కాస్త స్థిరపడగానే ఇల్లు కట్టుకోవాలని అందరూ అనుకుంటారు. ప్రపంచంలోని ధనవంతులు విలాసవంతమైన భవనాల్లో నివసిస్తున్నారు. కానీ, ప్రపంచ బిలియనీర్లలో అగ్రస్థానంలో ఉన్న టెస్లా, స్పేస్ ఎక్స్ ఓనర్ ఎలన్ మస్క్ కు సొంతిల్లే లేదంట..! ఆశ్చర్యంగా ఉన్నా  ఇదే నిజం. ఈ విషయం స్వయంగా ఆయనే టెడ్ చానల్  ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. తనకు సొంతిల్లు లేదని, స్నేహితుల ఇండ్లలో ఖాళీగా ఉండే బెడ్ రూమ్స్​లో పడుకుంటా నని చెప్పాడు. నాకంటూ సొంత ప్లేస్ లేదని.. ఎప్పుడైనా బే ఏరియాలో ఉన్న టెస్లా ఇంజనీరింగ్ సంస్థలకు వెళ్లినప్పు డు రోజుకో ఫ్రెండ్ ఇంట్లో ఉంటానని వెల్లడించాడు. బిలియనీర్లకు ఉండే యాచ్ (విలాసవంతమైన పడవ) కూడా లేదని, విహారయాత్రలకు పోనని మస్క్ చెప్పాడు. కాకపోతే టైం ఆదా చేసుకోవడానికి ఫ్లైట్​లో ఎక్కువగా ప్రయాణిస్తానని చెప్పాడు. ప్రస్తుతం మస్క్ నెట్ వర్త్ 269.5 బిలియన్ డాలర్లని ఫోర్బ్స్ మ్యాగజైన్ తెలిపింది. ఇటీవల 43 బిలియన్ డాలర్లకు మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ను కొనుగోలు చేస్తానని మస్క్ ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. మస్క్  ప్రస్తుతం ట్విట్టర్ లో 9.1 శాతం వాటాతో రెండో మేజర్ షేర్ హోల్డర్​గా ఉన్నాడు.