జీ మెయిల్ షెట్ డౌన్ అయితే.. X Mail తీసుకొస్తా : ఎలన్ మస్క్

జీ మెయిల్ షెట్ డౌన్ అయితే.. X Mail తీసుకొస్తా : ఎలన్ మస్క్

జీ మెయిల్ షెట్ డౌన్ అంటూ ఎక్స్(ట్విట్టర్)లో ట్రెండ్ కావటం.. దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న టైంలోనే.. ఎలన్ మస్క్ ఎంట్రీ ఇచ్చారు. అగ్గికి ఆజ్యం పోసినట్లు.. జీ మెయిన్ షెట్ డౌన్ ట్రెండింగ్ పై స్పందించాడు మస్క్. జీ మెయిల్ షెట్ డౌన్ అయితే.. ఎక్స్ మెయిల్ వస్తుందంటూ తన అకౌంట్ నుంచి కామెంట్ చేయటం సంచలనంగా మారింది. అనూహ్య రీతిలో ట్విట్టర్ ను సొంతం చేసుకొని అందరిని ఆశ్చర్య పరిచిన ఎలాన్ మస్క్ ఇప్పుడు జీమెయిల్ షట్ డౌన్ అన్న పుకారు పుట్టగానే X mail తెస్తానంటూ కామెంట్ చేయటం చర్చనీయాంశం అయ్యింది.

ఎలాన్ మస్క్ మాట అటుంచితే, జీమెయిల్ నిలిపిచిపోతుందంటూ వచ్చిన పుకారు 4మిళియన్లకు పైగా ఉన్న యూజర్స్ ని టెన్షన్ పెట్టింది. జీమెయిల్ నిలిచిపోతే ప్రపంచమే స్తంభించిపోతుందన్న ఆందోళన అందరిలో మొదలైంది. అయితే, ఈ పుకార్లపై గూగుల్ సంస్థ స్పందిస్తూ జీమెయిల్ సర్వీసులను నిలిపివేయట్లేదంటూ క్లారిటీ ఇవ్వటంతో అందరూ ఊపిరి పీచుకున్నారు.

మస్క్ దూకుడు చూస్తుంటే జీమెయిల్ కి పోటీగా x మెయిల్ ని త్వరలోనే లాంచ్ చేసినా చేసేస్తాడని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఒకవేళ ప్రచారం జరిగినట్లు జీమేయిల్ గనక నిలిచిపోతే, యూజర్ల డేటా ఏమవుతుంది. జీమేయిల్ న బేస్ చేసుకొని నడుస్తున్న కంపెనీలు, యాప్స్ సంగతేంటీ, మస్క్ తీసుకొచ్చే ఆల్టర్నెట్ మెయిలింగ్ సిస్టం జీమెయిల్ ధీటుగా ఉంటుందా అన్న చర్చ నడుస్తోంది సోషల్ మీడియాలో.