టిమ్ కుక్తో ఎలాన్ మస్క్ భేటీ

టిమ్ కుక్తో ఎలాన్ మస్క్ భేటీ

యాపిల్, ట్విట్టర్ మధ్య వివాదం సద్దుమణించింది. యాపిల్ ఆఫీసుకు వెళ్లిన మస్క్ సీఈఓ టిమ్ కుక్తో భేటీయై అనేక అంశంపై చర్చించారు. అనంతరం రెండు కంపెనీల మధ్య వివాదం సద్దుమణిగినట్లు ప్రకటించారు. గతంలోలాగే ఇకపై కూడా ట్విట్టర, యాపిల్ మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.
 


ఇతరులపై ద్వేషాన్ని వ్యక్తపరిచే ప్లాట్ ఫాంగా ట్విట్టర్ మారిందని ఇటీవలే యాపిల్ అభిప్రాయపడింది. అది తమ ప్రైవసీ పాలసీకి విరుద్ధమని, అందుకే ట్విట్టర్ యాప్ స్టోర్ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అంతటితో ఆగకుండా ట్వి్ట్టర్ లో యాపిల్ ప్రకటనల్ని కూడా నిలిపివేసింది.  ఈ నిర్ణయంపై మస్క్ ట్విట్టర్ వేదికగా యాపిల్ కంపెనీపై విరుచుకుపడ్డాడు. యాపిల్ తీసుకున్న నిర్ణయాలకు కారణాలు చెప్పాలని ట్వీట్లతో ప్రశ్నించాడు. చివరకు టిమ్ కుక్ను కలిసి సమస్య పరిష్కరించుకున్నాడు.