సంచలన విషయం బయటపెట్టిన ఎలాన్ మస్క్ తండ్రి

సంచలన విషయం బయటపెట్టిన ఎలాన్ మస్క్ తండ్రి

ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రోల్‌ మస్క్‌(76 ఏళ్లు) తన పెంపుడు కుమార్తె జానా బెజుడెన్‌హౌట్‌(35 ఏళ్లు)తో శారీరక సంబంధాన్ని పెట్టుకున్నానని సంచలన వ్యాఖ్యలు చేశాడు. మూడేళ్ల క్రితం మరోసారి తండ్రినయ్యానంటూ చెప్పారు. తాజాగా జరిగిన ఓ మీడియా సమావేశంలో ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించాడు. 

యూకేకి చెందిన ఓ టాబ్లాయిడ్‌ ఎర్రోల్‌ మస్క్‌ను తాజాగా ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో ప్రపంచ సంతానోత్పత్తి రేటు తగ్గే అవకాశం ఉందంటూ వాషింగ్టన్ యూనివర్శిటీ ఓ డేటాను విడుదల చేసింది. ఆ నివేదిక ఆధారంగా ఎర్రోల్‌ మస్క్‌ మాట్లాడుతూ..తగ్గిపోతున్న జనాభాకు తన వంతు కృషి చేస్తున్నట్లు చెప్పాడు. ‘మనం ఈ భూమిపై ఉన్నది పునరుత్పత్తి కోసమే. అందుకే జానా బెజుడెన్‌హౌట్‌ తో తొలిసారి 2017లో అబ్బాయి ఎలియట్ రష్‌కు, 2019లో పాపకు జన్మనిచ్చాం’ అని చెప్పాడు.

 
ఎలన్ మస్క్ కు త‌న తండ్రి ఎర్రోల్ మ‌స్క్ అంటే అస్స‌లు న‌చ్చ‌దని చాలామంది అంటుంటారు. సౌతాఫ్రికాలో బిజినెస్ మ్యాన్ గా ఉన్న ఎర్రోల్..తొలిసారి ఎలన్ మ‌స్క్ త‌ల్లి మాయే హాల్డెమాన్‌ ను వివాహం చేసుకున్నాడు. మాయే హాల్డెమాన్‌ ద్వారా ఎర్రోల్ మస్క్‌కు ముగ్గురు పిల్లలు. వారు ఎలోన్ మస్క్, కింబాల్, టోస్కా ఉన్నారు. ఆ త‌రువాత మాయే హాల్డెమాన్‌ కు విడాకులు ఇచ్చి అప్ప‌టికే పెళ్లై 10ఏళ్ల కూతురు ఉన్నహెడీని పెళ్లి చేసుకున్నాడు. కొన్ని సంవ‌త్స‌రాల త‌రువాత రెండో భార్య హెడీకి విడాకులు ఇచ్చి ఆమె కూతురు జానాను పెళ్లి చేసుకున్నాడు. ఎర్రోల్‌, జానా దంప‌తులు అబ్బాయి, అమ్మాయికి జ‌న్మ‌నిచ్చారు. రెండో భార్య కుమార్తె జానాకు ఎర్రోల్ మ‌స్క్ వ‌య‌స్సు వ్య‌త్యాసం 40ఏళ్లు. జానాకు 35, ఎర్రోల్‌ మస్క్‌కు 76 ఏళ్లు ఉన్నాయి. 

ఎలన్‌ మస్క్‌ కూడా అంతే..!
ఎర్రోల్‌ మస్క్‌ కుమారుడు ఎలన్‌ మస్క్‌ కూడా తన తొమ్మిది మంది సంతానంపై ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తగ్గిపోతున్న జనాభా సంక్షోభానికి తమ వంతు సాయం చేస్తున్నట్లు ట్వీట్‌ చేశాడు. ఇప్పుడు ఎలన్‌ మస్క్‌కు ఏ మాత్రం తీసిపోనంటూ ఆయన తండ్రి ఎర్రోల్‌ మస్క్‌ కూడా ఈ తరహా వ్యాఖ‍్యలు చేయడంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 

వివాదంలో ఎలన్ మస్క్
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్, ప్రఖ్యాత ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. ప్రస్తుతం న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటున్నాడు. 44 బిలియన్ డాలర్ల విలువ చేసే ట్విట్టర్ కొనుగోలు ఒప్పందాలను అర్ధాంతరంగా రద్దు చేసుకున్నాడు. ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నందుకు ట్విట్టర్ యాజమాన్యం ఆయనపై కోర్టుకెక్కింది.