
టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే 'గాడ్సే' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో మరో సినిమాతో సిద్ధం అయ్యాడు. సత్యదేవ్ నటించిన లేటెస్ట్ మూవీ 'కృష్ణమ్మ'. వివి గోపాలకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ సాంగ్ ను విడుదల చేశారు. ఏమవుతుందో మనలో... అంటూ సాగే ఈ పాటను దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేశారు. అనంత శ్రీరామ్ ఈ పాటకు సాహిత్యంను అందించగా.. కాలభైరవ సంగీతాన్ని అందించాడు. సింగర్ సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించాడు.
పాట మెలోడీ ట్యూన్ తో సాగుతూ క్లాస్, మాస్ ఆడియన్స్ ను మెప్పిస్తోంది. ఈ పాట బాగుందంటూ నెట్టింట కామెంట్స్ వస్తున్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే తాజాగా విడుదల అయిన టీజర్ కూడా యూత్ ఆడియన్స్ తో పాటు అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉందంటూ కామెంట్స్ వచ్చాయి. అయితే ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటించబోతున్నారు. మరి ఈ సినిమాతో సత్యదేవ్ మరో విజయాన్ని సొంతం చేసుకుంటాడో చూడాలి.