
ముంబై: క్యూఆర్ కోడ్స్ స్కాన్‌చేయడం ద్వారా యూపీఐ పేమెంట్లు చేసే కస్టమర్లకు సైతం ఈఎంఐ ఫెసిలిటీని ఐసీఐసీఐ బ్యాంక్ అందుబాటులోకి తెచ్చింది. తమ బ్యాంక్ పే లేటర్ ఎలిజిబిలిటీ ఉన్న కస్టమర్లందరికీ ఈ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని ఐసీఐసీఐ వెల్లడించింది. ట్రాన్సాక్షన్ ఎమౌంట్ రూ. 10 వేల కంటే ఎక్కువ వుంటేనే ఈఎంఐ ఆప్షన్ ఉంటుందని పేర్కొంది. మూడు, ఆరు, తొమ్మిది నెలల కాలానికి ఈ ఈఎంఐ ఆప్షన్లు ఉంటాయని వివరించింది. ఎలక్ట్రానిక్స్ఐటమ్స్, గ్రోసరీస్, అపారెల్ వంటి కొనుగోళ్లకు ఈఎంఐ ఆప్షన్ వాడుకోవచ్చని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. ఈ పే లేటర్ ఫెసిలిటీ కింద నెలవారీగా చెల్లించాల్సిన ఎమౌంట్‌ను సేవింగ్స్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్‌గా బ్యాంకు డెబిట్ చేస్తుంది. పే లేటర్ ఫెసిలిటీని ఐసీఐసీఐ బ్యాంక్ 2018 లోనే లాంఛ్ చేసింది. ప్రీ అప్రూవ్డ్ ఆఫర్లున్న కొంత మంది కస్టమర్లకు ఈ పే లేటర్ కూడా
అందుబాటులో ఉంటుంది.