పెరుగుతున్న ఎమోషనల్ ‌‌‌ బ్లాక్‌‌‌‌మెయిలింగ్

పెరుగుతున్న ఎమోషనల్ ‌‌‌ బ్లాక్‌‌‌‌మెయిలింగ్

లైఫ్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌ను అదుపులో పెట్టుకోవడానికో లేదా ఎదుటి వ్యక్తిని చెప్పుచేతల్లో ఉంచుకోవడానికి ఎమోషనల్‌‌‌‌ బ్లాక్‌‌‌‌మెయిలింగ్‌‌‌‌ ఒక అస్త్రం. చాలామంది ఈ ప్రాబ్లమ్‌‌‌‌ ఎదుర్కొంటున్నారు. భార్యా భర్తల మధ్యే కాదు.. పిల్లలు-తల్లిదండ్రుల మధ్య ఇలాంటి సమస్యలు పెరుగుతున్నాయి. మానసికంగా చాలా ఇబ్బందిపడుతున్నారు. పరిస్థితి ముదిరి కుటుంబ బంధాల విచ్ఛిన్నానికి దారితీస్తున్నాయి. పీక్ స్టేజ్ లో తప్ప ముందే ఎవరికీ చెప్పుకోలేని సమస్యగా భావిస్తున్నారు చాలా మంది. ఇలాంటి సమస్య లతో తమ వద్దకు వస్తున్న కేసులు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. జీవిత భాగస్వామిని అదుపులో ఉంచుకునేందుకు, తాము చేసే తప్పులను ప్రశ్నించకుండా ఉండేందుకు చాలామంది ఎమోషనల్‌ బ్లాక్ మెయిల్‌ చేస్తుంటారు. దీనివల్ల రిలేషన్ షిప్‌ కొనసాగుతున్నప్పటికీ, ఇద్దరిమధ్యా సరైన బంధం మాత్రం ఉండదు. బాధితులు ధైర్యంగా ఎమోషనల్‌ బ్లాక్ మెయిలింగ్ ను ఎదుర్కోగలిగితేనే, ఇద్దరూ బాగుంటారు. రిలేషన్ ప్‌ బలమేంటో తెలుస్తది.ఇందుకోసం బాధితులే ముందడుగేయాలి.

ఎమోషనల్‌‌‌‌ బ్లాక్‌‌‌‌మెయిలింగ్‌‌‌‌ అంటే ఒక రకమైన బెదిరింపు. తాము చెప్పినట్లు వినకపోతే, చెప్పింది చేయకపోతే, నచ్చినట్లు నడుచుకోకపోతే ఎదుటి వ్యక్తికి హాని చేస్తామని లేదా తమకు తాము హాని చేసుకుంటామని బెదిరించడమే ఎమోషనల్‌‌‌‌ బ్లాక్‌‌‌‌మెయిలింగ్‌‌‌‌. బాగా దగ్గరి వ్యక్తులమీదే ఎమోషనల్‌‌‌‌ బ్లాక్‌‌‌‌మెయిలింగ్‌‌‌‌కు పాల్పడుతుంటారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఎమోషనల్‌‌‌‌ బ్లాక్‌‌‌‌మెయిలింగ్‌‌‌‌ ఎక్కువగా ఉంటుంది. లవర్స్‌‌‌‌ మధ్య కూడా ఉంటుంది. దీనివల్ల ఇద్దరిలో ఒకరు బాధపడుతుంటారు. బాధితుల్లో కోపం, భయం, తప్పు చేస్తున్నామనే ఫీలింగ్‌‌‌‌ వంటివి ఉంటాయి. రోజూ  ఇబ్బందిపడతారు.

ఇలా చేయండి

ఎమోషనల్‌‌‌‌ బ్లాక్‌‌‌‌మెయిలింగ్‌‌‌‌ను ఎదుర్కోవడం ఎవరికైనా పెద్ద సమస్యే. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్‌‌‌‌ ఎదురయ్యేది బాగా ఇష్టమైన, దగ్గరి వ్యక్తి నుంచే. అయినప్పటికీ, ఈ పరిస్థితిని దాటాలి. ఇది బాధితుల చేతుల్లోనే ఉంది. బాధితులు నిజాయితీగా ఉండాలి.

ఎదుటివ్యక్తి బలహీనతలను, తప్పులను సమర్థించకూడదు. పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌ ఎలా కంట్రోల్‌‌‌‌ చేస్తున్నారో తెలుసుకోవాలి. ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారో అర్థం చేసుకోవాలి.

రోజూ ఎదురవుతున్న పరిస్థితుల్ని మరింతగా అంచనా వేసేందుకు ఒక జర్నల్‌‌‌‌ మెయింటైన్‌‌‌‌ చేయాలి. పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌ ఎలా బిహేవ్‌‌‌‌ చేస్తున్నాడో రాసుకుంటూ ఉంటే, ఒక అంచనాకు రావొచ్చు.

ఎమోషనల్‌‌‌‌ బ్లాక్‌‌‌‌మెయిలింగ్‌‌‌‌కు లొంగుతున్నారంటే తనలోనే ఏమైనా తప్పుందేమో ఆలోచించుకోండి. మీరు గతంలో చేసిన తప్పులు లేదా మీ బలహీనతలు ఎదుటివ్యక్తికి అస్త్రంగా మారాయేమో తెలుసుకోవాలి.

ఇంకా ఏదైనా ప్రమాదానికి దారితీసే పరిస్థతి ఉంటే వారిని వారే రక్షించుకోవాలి. పిల్లలు, ఫ్యామిలీ మెంబర్స్‌‌‌‌ను కూడా కాపాడుకోవాలి. వాళ్లు ఎలాంటి ఇబ్బందికి గురికాకుండా చూడాలి.

సిచ్యుయేషన్‌‌‌‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన వాళ్ల హెల్ప్‌‌‌‌ అడగటంలో తప్పు లేదు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సాయం తీసుకుని, బ్లాక్‌‌‌‌మెయిలింగ్‌‌‌‌ను ఎదుర్కోండి. అవసరమైతే థెరపిస్ట్‌‌‌‌, ఫ్యామిలీ కౌన్సెలర్‌‌‌‌‌‌‌‌ను కలవాలి. మాటలతోనే సమస్య తీరాలనుకుంటే పార్ట్‌‌నర్‌‌తో అదేపనిగా డిస్కషన్‌‌ చేస్తూ ఉండాలి.

పరిస్థితిని బట్టి రిలేషన్‌‌‌‌షిప్‌‌‌‌ను బాగు చేసుకోవాలి. మీ స్వేఛ్చ, సంతోషం అన్నింటికంటే ముఖ్యం అని తెలుసుకోవాలి.

కొన్ని ఉదాహరణలు

ఎవరైనా ఒక తప్పు చేసి దొరికిపోయిన సందర్భంలో అది ఎవ్వరికీ చెప్పకుండా ఉండేందుకు, తమతోపాటు తప్పులో భాగస్వాములను చేసేందుకు ఎమోషనల్‌‌‌‌ బ్లాక్‌‌‌‌మెయిలింగ్‌‌‌‌ను వాడుకుంటారు. వివాహేతర సంబంధం ఉండి, దాన్ని వదులుకోలేమని బ్లాక్‌‌‌‌మెయిల్‌‌‌‌ చేస్తుంటారు. ఉద్యోగం చేయమని లేదా వదిలేయమని, మద్యపానం, ధూమపానం వంటి చెడు వ్యసనాలకు అలవాటు పడి, వాటిని వదిలేయమని చెప్పిన పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌ను కంట్రోల్‌‌‌‌ చేసేందుకు దీన్ని ఉపయోగిస్తారు.

 ఇలా గుర్తించొచ్చు

ఎమోషనల్‌‌‌‌ బ్లాక్‌‌‌‌మెయిల్‌‌‌‌కు గురవుతుంటే ముందుగా బాధితులు అది తెలుసుకోవడం చాలా ముఖ్యం.

పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌ మిమ్మల్ని ఏదైనా ఇష్టం లేని పని చేయమని బలవంత పెట్టడం.

మీకు లేదా ఫ్యామిలీ మెంబర్స్‌‌‌‌కు హాని చేస్తామని బెదించడం.

రిలేషన్‌‌‌‌షిప్‌‌‌‌లో ఎక్కువగా సర్దుకుపోవాల్సి రావడం.

ఇతరుల సంతోషం కోసం మీరు త్యాగాలు చేయడం.

ఇష్టమైనవి వదులుకోవాల్సి రావడం.

ఎదుటి వ్యక్తి చేసే తప్పుల్ని ప్రశ్నించలేని స్థితిలో ఉండడం.

ఇవన్నీ ఎమోషనల్‌‌‌‌ బ్లాక్‌‌‌‌మెయిలింగ్‌‌‌‌కు గురవుతున్నారని సూచనలు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దీనికి పరిష్కారం కనుక్కోవాలి. ఈ సిచ్యుయేషన్‌‌‌‌ను దాటి ముందుకెళ్తేనే లైఫ్‌‌‌‌ హ్యాపీగా ఉంటుంది.