వర్షం కారణంగా మ్యాచ్ ను 29 ఓవర్లకు కుదించిన ఎంపైర్లు

వర్షం కారణంగా మ్యాచ్ ను 29 ఓవర్లకు కుదించిన ఎంపైర్లు

హామిల్టన్‌ వేదికగా జరుగుతున్న భారత్, న్యూజిలాండ్‌ రెండో వన్డే మ్యాచ్ మధ్యలో వర్షం అంతరాయం కలిగించింది. 4వ ఓవర్లో ఆగిపోయిన మ్యాచ్, మళ్లీ మొదలయింది. మళ్లీ వర్షం పడే అవకాశాలు కనిపించడంతో ఎంపైర్లు మ్యాచ్ ని 29 ఓవర్లకు కుదించారు. వర్షం తగ్గి మ్యచ్ మొదలవ్వగానే మ్యాట్ హెన్రీ బౌలింగ్ లో ఫెర్గుసన్ కి క్యాచ్ ఇచ్చి కేప్టెన్ ధవన్ (10 బాల్స్ లో 3 రన్స్) ఔట్ అయ్యాడు. ప్రస్తుతం శుభ్ మన్ గిల్ (28), సూర్య కుమార్ యాదవ్ (3) క్రీజ్ లో ఉన్నారు. సిరీస్ రేసులో నిలవాలంటే భారత్ కు ఇది తప్పక గెలవాల్సిన మ్యాచ్.  తొలి వన్డేలో భారీ స్కోర్ చేసినప్పటికీ ఓటమి తప్పలేదు.