టూ మచ్ అనిపిస్తుందా : కోటి24 లక్షల జీతం.. ఆఫీసుకు రమ్మంటే మానేశారంట..

టూ మచ్ అనిపిస్తుందా : కోటి24 లక్షల జీతం.. ఆఫీసుకు రమ్మంటే మానేశారంట..

కరోనా సమయంలో ఐటీ కంపెనీలు, ఇతర కంపెనీలు వర్క్ ఫ్రం హోం విధానాన్ని అనుసరిస్తున్నాయి. మొదట్లో ఉద్యోగులు కాస్త ఇబ్బంది పడ్డా.. రాను రాను అలవాటై పోయింది. అలవాటు అయ్యాక ఇంట్లోనే ఉంటూ కుటుంబ సభ్యులతో గడుపుతూ ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే కోవిడ్ టైం అయిపోయాక.. కొన్నికంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసులకు వచ్చి పనిచేయమని ఆర్డర్ వేశాయి. ఈ క్రమంలోనే ఆమెజాన్ కూడా ఈ ఏడాది ప్రారంభం నుంచి ఉద్యోగులు ఆఫీసులకు వచ్చి పని చేయాలని ఆర్డర్ వేసింది. అమెజాన్ నిర్ణయం పట్ల ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు. దాదాపు 2వేల మంది ఉద్యోగులు అకస్మిక మార్పుకు నిరసన తెలిపారు. 

ఇటీవల అమెజాన్ తన ఉద్యోగులకు ఓ ఆర్డర్ పాస్ చేసింది. అదేంటంటే ఆఫీసులకు దగ్గరగా ఉండేట్లు తమ రెసిడెన్సీలను మార్చుకోవాలని ఉద్యోగులను కోరిందట. అమెజాన్ లో రిమోట్ వర్కర్ గా నియమించబడిన ఒకఅమెజాన్ ఉద్యోగి కూడా తన ఉద్యోగాన్ని కొనసాగించాలంటే.. రెసిడెన్సీ మార్చమని కోరిందట. అయితే ఆ ఉద్యోగి తన ఉద్యోగానికి రిజైన్ చేయాలని నిర్ణయించుకున్నాడట. అంతేకాదు సుమారు రూ. 1.60 కోట్ల పెట్టుబడి స్టాక్ లను విడిచిపెట్టుకున్నాడు. 

ఇలా ఉద్యోగాన్ని వదులుకున్న మాజీ అమెజాన్ ఉద్యోగి న్యూయార్క్ కు చెందినవారు.. ఇటీవల ఓ మీడియా ఇంటరాక్షన్ లో తన మొత్తం అనుభవాన్ని పంచుకున్నారు. నేను, నా భార్య ఎంతో కష్టపడి.. తమ కలల ఆస్తిని కొనుగోలు చేశామని.. దేశవ్యాప్తంగా ఉద్యోగం చేయడం తనకు ఇష్టం లేదని చెప్పాడు. తనను రిక్రూట్ చేసినప్పుడు రిమోట్ గా ఉండేలా డిజైన్ చేశారని తెలిపారు. 2023 జూన్ 1 నుంచి సీటెల్ నుంచి పనిచేయమని ఆమెజాన్ మేనేజర్ పట్టుబట్టారని దీంతో ఉద్యోగానికి రిజైన్ చేశానని చెప్పారు. 
అయితే సీటెల్ లో పనిచేస్తే తనకు సంవత్సరానికి 1.60 కోట్ల ప్యాకేజీని ఇస్తామని అమెజాన్ ప్రకటించిందని మాజీ అమెజాన్ ఉద్యోగి తెలిపారు. ప్రస్తుతం ఓ స్టార్టప్ కంపెనీలో మునపటి మాదిరిగానే మూల వేతనాన్ని సంపాదిస్తున్నాడట.