ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయ్ సామీ.. వర్షాల్లో Ola, Uber, Rapido బుక్ కాకపోతే ఇలా చేస్తారా..!

ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయ్ సామీ.. వర్షాల్లో Ola, Uber, Rapido బుక్ కాకపోతే ఇలా చేస్తారా..!

ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కావాల్సిన వన్నీ కోరుకున్న చోటికే వచ్చేస్తున్నాయి. అలా ప్రజా రవాణాలో కూడా కీలక మార్పులు తీసుకొచ్చాయి ఓలా, ర్యాపిడో, ఉబెర్ వంటి స్టార్టప్ కంపెనీలు. ఈరోజుల్లో చాలా మంది వీటి సేవలను తరచుగా ఉపయోగిస్తున్నారు. ప్రధానంగా వర్షాలు పడినప్పుడు ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లటానికి నగరాల్లో చాలా మంది క్యాబ్ బుక్కింగ్ కోసం వినియోగిస్తుంటారు. కానీ వర్షాల సమయంలో బుక్కింగ్ కన్ఫమ్ కావటం చాలా సార్లు కష్టంతో కూడుకున్నదని తెలిసిందే.

ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో గురుగ్రామ్ నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ఒక కంపెనీలోని చాలా మంది ఉద్యోగులు ఇంటికి వెళ్లేందుకు క్యాబ్, ఆటోలు బుక్ చేసుకునేందుకు ఓలా, ఉబెర్, ర్యాపిడోలో ట్రే చేసినప్పటికీ క్యాబ్స్ అందుబాటులో లేకపోవటం, భారీగా రేట్లు ఉండటం గమనించారు. దీంతో వారు తమ తెలివికి పదునుపెట్టారు. సదరు ఉద్యోగులు వర్షంలో ఇంటికి చేరుకునేందుకు పోర్టర్ ద్వారా ఒక మినీ ట్రక్ బుక్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. 

 

వరదల సమయంలో ఉద్యోగులు తెలివిగా పోర్టర్ ద్వారా ట్రక్ బుక్ చేసుకుని ఇళ్లకు చేరటంపై చాలా మంది నెటిజన్లు వారెవ్రా ఏం ఐడియా గురూ అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు గురుగ్రాములో ఉన్న వాస్తవ పరిస్థితులతో కార్పొరేట్ ఉద్యోగుల దీనస్థితిపై జాలిపడుతున్నారు. గురుగ్రాములో కురుస్తున్న భారీ వరదలతో కొందరు ఉద్యోగులు తమ ఆఫీసులకు దగ్గరలోని హోటల్ రూమ్స్ బుక్ చేసుకున్నట్లు చెబుతున్నారు. దీని ద్వారా రోడ్లపై గంటల తరబడి ట్రాఫిక్ జామ్స్ నుంచి అలాగే నిలిచిపోయిన నీటి వల్ల ప్రయాణ కష్టాలను తప్పించుకుంటున్నట్లు చెబుతున్నారు. 

►ALSO READ | Yamuna flood: యమునా నది వరదలు..ఢిల్లీలో10వేల మందికి పైగా తరలింపు

ఇలాంటి పరిస్థితులను సమర్థవంతంగా నిర్వహించేందుకు గురుగ్రామ్ పోలీసులు ప్రజలను భారీ వర్షాలపై హెచ్చరిస్తూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కోరుతున్నారు. అలాగే కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఆఫర్ చేయాలని అంటున్నారు. ఇక ఈ భారీ వర్షాలతో స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించారు.