
భారీ వర్షాలు ,హర్యానాలోని హతినికుండ్ బ్యారేజీ నుంచి నిరంతర వరద ఉధృతితో యమునానది ఉప్పొంది ప్రవహిస్తోంది.యమునా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో ఘజియాబాద్జల దిగ్భంధంలో చిక్కుకుంది. కాలనీలు, ఇండ్లు నీటమునిగాయి. రాకపోకలు స్థంభించాయి. దాదాపు వెయ్యి మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సుమారు 15వందల జంతువులను కూడా తరలించారు. 2023 నాటి వరద బీభ్సతం తర్వాత మంగళవారం (సెప్టెంబర్ 2) న మరోసారి ఢిల్లీని యమునానది వరదలు ముంచెత్తాయి.
బుధవారం ఉదయంనాటికి ఓఖ్లా బ్యారేజీ దగ్గర యమునా నది ఉధృతంగా ప్రవహిస్తోంది.యమునా నీటిమట్టం 199.15మీటర్లకు పెరిగి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఓఖ్లా బ్యారేజీ దగ్గర లక్షా 2వేల 444 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు.
గంటగంటకు పెరుగుతున్న యమునా వరద నది ఒడ్డున ఉన్న ఢిల్లీలోని పలు ప్రాంతాలకు ముప్పుగా మారింది. ఇండ్లు, వ్యవసాయ భూములు నీట మునిగాయి. ముందస్తు చర్యగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారు. ఇప్పటికే వెయ్యిమందిని తరలించారు. పోలీసులు,ఆరోగ్య బృందాలు సహాయ కేంద్రాలలో సహాయకచర్యలు చేపట్టారు.
మోకాళ్ల లోతు నీటిలో నడుచుకుంటూ వెళ్తున్న ప్రజలు, ఫర్నిచర్ నిండిన బండ్లను తోసుకుంటూ వెళ్తున్న దృశ్యాలు..తమ పశువులను సురక్షితంగా తీసుకువెళుతూ ట్రాక్టర్లు ,కార్లను నడుపుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఇవి 2023లో ఈ ప్రాంతాన్ని తాకిన వరద బీభత్స జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చాయి.
సెక్టార్ 150లోని మోమ్నాథల్ గ్రామం పూర్తిగా జలదిగ్భంలో చిక్కుకుపోయింది. వరద ప్రవాహం యమునా నది కరకట్ట దాకా చేరింది. యమునా మరింత ఉప్పొంగితే పూర్తిగా గ్రామంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. 2023లో వరదలు 18 గ్రామాలను ముంచెత్తాయి. 3వేల700 మందిని నిరాశ్రయులయ్యారు. దాదాపు 1,600 హెక్టార్ల వ్యవసాయ భూములను వరదల్లో కొట్టుకుపోయి తీవ్రంగా నష్టపోయింది.