కోటి కోట్లతో గతి శక్తి

కోటి కోట్లతో గతి శక్తి

యువతకు ఉపాధి, ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా 
స్కీమ్​ను ప్రకటించిన ప్రధాని మోడీ
ఎకానమిక్​ జోన్ల ఏర్పాటుకు అవకాశం
నేషనల్​ హైడ్రోజన్​ మిషన్​కు శ్రీకారం
హైడ్రోజన్​ హబ్​గా ఇండియా
వచ్చే 25 ఏండ్లు అమృత ఘడియలు
దేశాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
ఉడాన్​ స్కీమ్​లో 21 ఎయిర్​పోర్టులు
ఏపీలో మూడు విమానాశ్రయాలు 
సైనిక్​ స్కూళ్లలో అమ్మాయిలకూ అవకాశం
ఇండిపెండెన్స్​ డే సందర్భంగా ఎర్రకోటపై జెండా ఆవిష్కరణ​ 

న్యూఢిల్లీ:  దేశాన్ని ఆర్థిక శక్తిగా నిలపడం, యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. రూ.కోటి కోట్లతో ‘ప్రధాన మంత్రి గతి శక్తి నేషనల్​ మాస్టర్​ ప్లాన్​’ను ఆయన ప్రకటించారు. ఇందులో భాగంగా దేశంలో మౌలిక వసతులను మరింతగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. స్థానిక తయారీదారులను ప్రపంచంలో పోటీదారులుగా నిలిపేందుకు ఇది దోహదపడుతుందన్నారు.  గతిశక్తిలో భాగంగా భవిష్యత్తులో మరిన్ని ఎకానమిక్​ జోన్లను ఏర్పాటు చేస్తామన్నారు. అత్యాధునిక టెక్నాలజీలను వాడుకుంటూ వరల్డ్​ క్లాస్​ ప్రొడక్ట్​లను తయారు చేయడానికి గతిశక్తి తోడ్పడుతుందన్నారు. ‘సులభమైన జీవితం’, ‘సులభమైన వ్యాపారం’ చేసుకునేందుకు పన్నుల సంస్కరణలు ఉపయోగపడతాయని చెప్పారు. ఆదివారం 75వ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరేశారు. తర్వాత ప్రజలనుద్దేశించి మాట్లాడారు. 90 నిమిషాల తన ప్రసంగంలో ఆడపిల్లల అభివృద్ధి, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలు, రైతుల పురోగతి, టెర్రరిజం, వాతావరణ మార్పులు, విస్తరణవాదాలపై ఆయన మాట్లాడారు. దేశంలో సంస్కరణలను తీసుకురావాలంటే రాజకీయ చిత్తశుద్ధి ఉండాలన్నారు.
హైడ్రోజన్​ హబ్​
వాతావరణానికి మేలు చేసే ‘నేషనల్​ హైడ్రోజన్​ మిషన్​’ను ప్రారంభిస్తున్నట్టు ప్రధాని మోడీ చెప్పారు. దీంతో ప్రపంచంలో గ్రీన్​ హైడ్రోజన్​కు ఇండియా గ్లోబల్​ హబ్​గా మారుతుందన్నారు. రాబోయే 25 ఏండ్లలో కరెంట్​, ఇంధనం విషయంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా ప్రయత్నాలు చేయాల్సిన ​అవసరముందన్నారు. ప్రస్తుతం రూ.12 లక్షల కోట్ల విలువైన ఇంధన దిగుమతులు జరుగుతున్నాయని ఆయన గుర్తు చేశారు. కరెంట్​ బండ్లు, గ్యాస్​ ఆధారిత ఎకానమీ, పెట్రోల్​లో ఇథనాల్​ మిక్సింగ్​ వంటి వాటితో పాటు దేశాన్ని హైడ్రోజన్​ ప్రొడక్షన్​ హబ్​గా మారుస్తామన్నారు. ఇప్పటికే 100 గిగావాట్ల రెన్యువబుల్​ ఎనర్జీ లక్ష్యాన్ని చేరుకున్నామన్నారు. 
అమృత ఘడియలు ముందున్నయ్​
దేశం వందో స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే నాటికి ‘ఆత్మనిర్భర్​ భారత్​’ కలను నిజం చేసుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. దేశం ఇంతకుముందెన్నడూ లేని విధంగా అభివృద్ధి సాధించిందని, ఇప్పుడు వంద శాతం అభివృద్ధే అందరి లక్ష్యం కావాలని చెప్పారు. వచ్చే 25 ఏండ్లు ‘అమృత ఘడియలు’ అని, ఈ ‘భారత వికాస యాత్ర’లో ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచే తమ వంతు కృషి చేయాలని సూచించారు. ‘సబ్​ కా సాత్​, సబ్​ కా వికాస్​, సబ్​ కా విశ్వాస్​’కు ఇప్పుడు ‘సబ్​ కా ప్రయాస్​’ కూడా తోడు కావాలని చెప్పారు. ప్రజల జీవితాల్లో ప్రభుత్వాల అనవసర జోక్యం ఉండని దేశ నిర్మాణమే ‘అమృత ఘడియలు’ లక్ష్యమని చెప్పారు. దేశాన్ని మార్చడంతో పాటు ప్రజలూ మారాల్సిన సమయం వచ్చిందన్నారు. 
వేగంగా ఎయిర్​పోర్టుల నిర్మాణం
గ్రీన్​ఫీల్డ్​ ఎయిర్​పోర్టుల అభివృద్ధికి తాము కృషి చేస్తున్నామని ప్రధాని మోడీ చెప్పారు. ఉడాన్​ పథకం కింద దేశమంతటా 21 ఎయిర్​పోర్ట్​లను ఏర్పాటు చేస్తున్నామని, అందులో ఆరు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయని వివరించారు. ఏపీలో మూడు విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. మారుమూల ప్రాంతాలకూ విమాన సర్వీసులను నడిపించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆ ప్రాంతాలకు విమానాలను నడిపే ఎయిర్​లైన్స్​కు ఇన్సెంటివ్స్​ ఇస్తున్నామని, ప్రతి ఒక్కరికీ విమాన ప్రయాణం అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఏపీలోని ఓర్వకల్​ (కర్నూల్​), దగదర్తి (నెల్లూరు), భోగాపురం, గోవాలోని మోపా, మహారాష్ట్రలోని నవీ ముంబై, సింధు దుర్గ్​, షిర్డీ, కర్నాటకలోని బీజాపూర్​, హసన్​, కలబురిగి, షిమోగా, మధ్యప్రదేశ్​లోని దాబ్రా (గ్వాలియర్​), పుదుచ్చెరిలోని కరైకాల్​,  వెస్ట్​బెంగాల్​లో దుర్గాపూర్​, సిక్కింలో పక్యోంగ్​, కేరళలో కన్నూరు ఎయిర్​పోర్టులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. షిర్డీ, ఓర్వకల్​, కన్నూర్​, కలబురిగి, పక్యోంగ్​, దుర్గాపూర్​ఎయిర్​పోర్టులు ఇప్పటికే సేవలను అందిస్తున్నాయని ఆయన చెప్పారు. హిమాచల్​ప్రదేశ్​లోని మండీ, కేరళలో కొట్టాయం, ఉత్తరాఖండ్​లో పంత్​నగర్​, మహారాష్ట్రలో పురందర్​ (పుణే) ఎయిర్​పోర్టులకు ప్రపోజల్స్​ వచ్చాయని మోడీ చెప్పారు. 
సైనిక్​ స్కూళ్లలో అమ్మాయిలకు అవకాశం
ఇక నుంచి దేశంలోని అన్ని సైనిక్​, ఆర్మీ స్కూళ్లలో అమ్మాయిలకు అవకాశం కల్పించనున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించారు. అబ్బాయిలకు సమానంగా అవకాశాలను ఇస్తామన్నారు. ప్రస్తుతం దేశమంతటా 33 సైనిక్​ స్కూళ్లున్నాయని, వాటన్నింటిలోనూ అమ్మాయిలకు ప్రవేశాలు కల్పిస్తామన్నారు. 
ఏదైనా చేస్తామనే తరం ఇది

75 వందే భారత్​ రైళ్లు
75 వారాల ‘ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​’లో భాగంగా వివిధ ప్రాంతాలను కలిపేలా 75 వందే భారత్​ రైళ్లను ప్రారంభిస్తామని మోడీ చెప్పారు. దేశంలోని ప్రతి మూలకు ఆ రైళ్లు నడుస్తాయన్నారు. ఈశాన్య రాష్ట్రాల రాజధానులకూ రైల్​ కనెక్టివిటీని అందిస్తామన్నారు. దేశానికి అది ఎంతో అవసరమన్నారు. ఒక్క సిక్కిం తప్ప మిగతా ఈశాన్య రాష్ట్రాలన్నింటికీ రైల్​ కనెక్టివిటీ ఉందన్నారు. 
పేదరికంపై పోరాడేందుకే ఎడ్యుకేషన్ పాలసీ
పేదరికంపై పోరాడేందుకే కొత్త ఎడ్యుకేషన్​పాలసీని తీసుకొచ్చామని ప్రధాని మోడీ చెప్పారు. స్థానిక భాషల్లోనే టీచింగ్​ సాగేలా ఈ పాలసీ దోహదం చేస్తుందన్నారు. కొత్త ఎడ్యుకేషన్​ పాలసీలో భాగంగా ‘ఆటలనూ’ ఓ సబ్జెక్ట్​గా చేర్చామన్నారు. జీవితంలో ముందుకు వెళ్లేందుకు ఆటలు కూడా దోహదం చేస్తాయన్నారు. 
రైతుల బాగు కోసం..
చిన్న రైతుల జీవితాలను బాగు చేసేందుకూ చర్యలు తీసుకుంటున్నామని ప్రధాని మోడీ చెప్పారు. దేశమంతటా 70 రూట్లలో కిసాన్​ రైళ్లను నడుపుతున్నామన్నారు. దేశంలో 2 హెక్టార్లలోపున్న రైతులే 80 శాతం మంది దాకా ఉన్నారని మోడీ చెప్పుకొచ్చారు. వారంతా దేశానికి గర్వకారణమని, వారికి మెరుగైన సౌలతులను కల్పిస్తామని చెఎప్పారు. దేశవ్యాప్తంగా 75 వేల వెల్​నెస్​ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్​ ప్లాంట్లను నిర్మించామన్నారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లలో సమాన అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.  
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మార్చేసినం
ప్రపంచ దేశాలతో మన దేశ సంబంధాల రూపు రేఖలు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మారిపోయాయని ప్రధాని మోడీ చెప్పారు. ఇప్పుడు కరోనా తర్వాత మరో ‘కొత్త ప్రపంచం’ సాకారమయ్యే అవకాశం ఉందన్నారు. ఒకప్పుడు ప్రపంచం చేసిన మంచిని ఇండియా మెచ్చుకుందన్న ప్రధాని.. ఇప్పుడు ఆ ప్రపంచ దేశాలే ఇండియా వైపు చూస్తున్నాయని చెప్పారు. అయితే, ప్రస్తుతం ఇండియా టెర్రరిజం, విస్తరణవాదం అనే రెండు అతిపెద్ద సవాళ్లను ఎదుర్కొంటోందని పాకిస్తాన్​, చైనాలను ఉద్దేశించి అన్నారు. అయినా ఎప్పటికప్పుడు సర్జికల్​ స్ట్రైక్స్​, ఎయిర్​ స్ట్రైక్స్​తో ‘నయా ఇండియా’ను పరిచయం చేశామన్నారు.
కరెంట్​ బండ్లు, గ్యాస్​ ఆధారిత ఎకానమీ, పెట్రోల్​లో ఇథనాల్​ మిక్సింగ్​ వంటి వాటితో పాటు దేశాన్ని హైడ్రోజన్​ ప్రొడక్షన్​ హబ్​గా మారుస్తామన్నారు. ఇప్పటికే 100 గిగావాట్ల రెన్యువబుల్​ ఎనర్జీ లక్ష్యాన్ని చేరుకున్నామన్నారు. 
అమృత ఘడియలు ముందున్నయ్​
దేశం వందో స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే నాటికి ‘ఆత్మనిర్భర్​ భారత్​’ కలను నిజం చేసుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. దేశం ఇంతకుముందెన్నడూ లేని విధంగా అభివృద్ధి సాధించిందని, ఇప్పుడు వంద శాతం అభివృద్ధే అందరి లక్ష్యం కావాలని చెప్పారు. వచ్చే 25 ఏండ్లు ‘అమృత ఘడియలు’ అని, ఈ ‘భారత వికాస యాత్ర’లో ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచే తమ వంతు కృషి చేయాలని సూచించారు. ‘సబ్​ కా సాత్​, సబ్​ కా వికాస్​, సబ్​ కా విశ్వాస్​’కు ఇప్పుడు ‘సబ్​ కా ప్రయాస్​’ కూడా తోడు కావాలని చెప్పారు. ప్రజల జీవితాల్లో ప్రభుత్వాల అనవసర జోక్యం ఉండని దేశ నిర్మాణమే ‘అమృత ఘడియలు’ లక్ష్యమని చెప్పారు. దేశాన్ని మార్చడంతో పాటు ప్రజలూ మారాల్సిన సమయం వచ్చిందన్నారు. 
75 వందే భారత్​ రైళ్లు 
75 వారాల ‘ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​’లో భాగంగా వివిధ ప్రాంతాలను కలిపేలా 75 వందే భారత్​ రైళ్లను ప్రారంభిస్తామని మోడీ చెప్పారు. దేశంలోని ప్రతి మూలకు ఆ రైళ్లు నడుస్తాయన్నారు. ఈశాన్య రాష్ట్రాల రాజధానులకూ రైల్​ కనెక్టివిటీని అందిస్తామన్నారు. దేశానికి అది ఎంతో అవసరమన్నారు. ఒక్క సిక్కిం తప్ప మిగతా ఈశాన్య రాష్ట్రాలన్నింటికీ రైల్​ కనెక్టివిటీ ఉందన్నారు. 
పేదరికంపై పోరాడేందుకే ఎడ్యుకేషన్ పాలసీ
పేదరికంపై పోరాడేందుకే కొత్త ఎడ్యుకేషన్​పాలసీని తీసుకొచ్చామని ప్రధాని మోడీ చెప్పారు. స్థానిక భాషల్లోనే టీచింగ్​ సాగేలా ఈ పాలసీ దోహదం చేస్తుందన్నారు. కొత్త ఎడ్యుకేషన్​ పాలసీలో భాగంగా ‘ఆటలనూ’ ఓ సబ్జెక్ట్​గా చేర్చామన్నారు. జీవితంలో ముందుకు వెళ్లేందుకు ఆటలు కూడా దోహదం చేస్తాయన్నారు. 
రైతుల బాగు కోసం..
చిన్న రైతుల జీవితాలను బాగు చేసేందుకూ చర్యలు తీసుకుంటున్నామని ప్రధాని మోడీ చెప్పారు. దేశమంతటా 70 రూట్లలో కిసాన్​ రైళ్లను నడుపుతున్నామన్నారు. దేశంలో 2 హెక్టార్లలోపున్న రైతులే 80 శాతం మంది దాకా ఉన్నారని మోడీ చెప్పుకొచ్చారు. వారంతా దేశానికి గర్వకారణమని, వారికి మెరుగైన సౌలతులను కల్పిస్తామని చెఎప్పారు. దేశవ్యాప్తంగా 75 వేల వెల్​నెస్​ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్​ ప్లాంట్లను నిర్మించామన్నారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లలో సమాన అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.  
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మార్చేసినం
ప్రపంచ దేశాలతో మన దేశ సంబంధాల రూపు రేఖలు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మారిపోయాయని ప్రధాని మోడీ చెప్పారు. ఇప్పుడు కరోనా తర్వాత మరో ‘కొత్త ప్రపంచం’ సాకారమయ్యే అవకాశం ఉందన్నారు. ఒకప్పుడు ప్రపంచం చేసిన మంచిని ఇండియా మెచ్చుకుందన్న ప్రధాని.. ఇప్పుడు ఆ ప్రపంచ దేశాలే ఇండియా వైపు చూస్తున్నాయని చెప్పారు. అయితే, ప్రస్తుతం ఇండియా టెర్రరిజం, విస్తరణవాదం అనే రెండు అతిపెద్ద సవాళ్లను ఎదుర్కొంటోందని పాకిస్తాన్​, చైనాలను ఉద్దేశించి అన్నారు. అయినా ఎప్పటికప్పుడు సర్జికల్​ స్ట్రైక్స్​, ఎయిర్​ స్ట్రైక్స్​తో ‘నయా ఇండియా’ను పరిచయం చేశామన్నారు.
వేగంగా ఎయిర్ ​పోర్టుల నిర్మాణం
గ్రీన్​ఫీల్డ్​ ఎయిర్​పోర్టుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని మోడీ చెప్పారు. ఉడాన్​ పథకం కింద దేశమంతటా 21 ఎయిర్​పోర్ట్​లను ఏర్పాటు చేస్తున్నామని, అందులో ఆరు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయని వివరించారు. ఏపీలో మూడు విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. మారుమూల ప్రాంతాలకూ విమాన సర్వీసులను నడిపించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆ ప్రాంతాలకు విమానాలను నడిపే ఎయిర్​లైన్స్​కు ఇన్సెంటివ్స్​ ఇస్తున్నామని, ప్రతి ఒక్కరికీ విమాన ప్రయాణం అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఏపీలోని ఓర్వకల్​ (కర్నూల్​), దగదర్తి (నెల్లూరు), భోగాపురం, గోవాలోని మోపా, మహారాష్ట్రలోని నవీ ముంబై, సింధు దుర్గ్​, షిర్డీ, కర్నాటకలోని బీజాపూర్​, హసన్​, కలబురిగి, షిమోగా, మధ్యప్రదేశ్​లోని దాబ్రా (గ్వాలియర్​), పుదుచ్చెరిలోని కరైకాల్​,  వెస్ట్​బెంగాల్​లో దుర్గాపూర్​, సిక్కింలో పక్యోంగ్​, కేరళలో కన్నూరు ఎయిర్​పోర్టులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. షిర్డీ, ఓర్వకల్​, కన్నూర్​, కలబురిగి, పక్యోంగ్​, దుర్గాపూర్​ఎయిర్​పోర్టులు ఇప్పటికే సేవలను అందిస్తున్నాయని ఆయన చెప్పారు. హిమాచల్​ప్రదేశ్​లోని మండీ, కేరళలో కొట్టాయం, ఉత్తరాఖండ్​లో పంత్​నగర్​, మహారాష్ట్రలో పురందర్​ (పుణే) ఎయిర్​పోర్టులకు ప్రపోజల్స్​ వచ్చాయని మోడీ చెప్పారు. 