ఉపాధి హామీ బిల్లులు వడ్డీతో సహా చెల్లించాలి

ఉపాధి హామీ బిల్లులు వడ్డీతో సహా చెల్లించాలి
  • ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

అమరావతి: ఉపాధి హామీ పథకం కింద బిల్లులను వడ్డీతో సహా చెల్లించాలంటూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. బకాయిలన్నీ నాలుగు వారాల్లోగా 12 శాతం వడ్డీతో సహా చెల్లించాలని హైకోర్టు స్పష్టం చేసింది. బిల్లులను 20 శాతం తగ్గించి ఇవ్వాలంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టేసింది.
1013 పిటిషన్ల బిల్లుల చెల్లింపుపై విచారణ చేపట్టిన హైకోర్టు పనులు చేసిన నాటి నుంచి 12 శాతం వడ్డీతో వెంటనే చెల్లించాలని ఆదేశాలిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం తగ్గించి బిల్లులు చెల్లించాలని ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ రెండు వేలకు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి, వాటిలో 1,013 పిటిషన్లపై విచారణ పూర్తి చేసిన హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది.