బొమ్మలతో ఫిల్ అయిన పాఠశాల బస్సు సీట్లు

బొమ్మలతో ఫిల్ అయిన పాఠశాల బస్సు సీట్లు

ఉక్రెయిన్ పై రష్యా సృష్టించిన బీభత్సం గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. ఊహకు అందని రష్యా దాడులతో ఉక్రెయిన్ అల్ల కల్లోలం అయింది. ఏ బాంబు వచ్చి మీద పడుతుందో తెలియక అక్కడి ప్రజలు నరకం చూస్తున్నారు. పుతిన్ పూనుకున్న ఈ దాడుల కారణంగా పెద్ద వాళ్లే కాదు... ఏ కల్మషం లేని పిల్లలు కూడా సతమతమయ్యారు. 

ఫిబ్రవరి 24నుంచి ఉక్రెయిన్‌పై రష్యా ప్రారంభించిన యుద్ధం వల్ల దాదాపు 243మంది పిల్లలు మృత్యువాత పడ్డట్టు సమాచారం. కాగా అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ ఓ హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. ఎల్వివ్ సెంట్రల్ స్క్వేర్‌లో ఖాళీ సీట్లతో ఆపి ఉంచిన పసుపు రంగులో ఉన్న పాఠశాల బస్సులు అందర్నీ ఓ క్షణం ఆగేటట్టు చేశాయి. అంత చూసేంతగా ఏముంది అందులో... పాఠశాలలో ఎవరుంటారు.. స్కూలు పిల్లలే కదా అనుకునేరు. కానేకాదు. పాఠశాల విద్యార్థులు కాకుండా ఆ స్థానంలో  కొన్ని సీట్లు బొమ్మలతో నింపబడితే, మరికొన్ని సీట్లు వారి పేరు ట్యాగ్‌లతో ఫిల్ చేశారు. ఈ ఘటనను చూస్తుంటే పిల్లలపైనా రష్యా సేన ఎలాంటి దౌర్జన్యానికి పాల్పడ్డారో తెలుస్తోంది. పిల్లలు కూర్చోవాల్సిన ఆ బస్సు సీట్లల్లో బొమ్మలు ఉండడం చూస్తే కళ్లు చెమర్చక తప్పదు. 

మరిన్ని వార్తల కోసం...

ఈ బాలుడు ఎవరు ?

పేరు మార్చుకున్న దేశం