
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ(OG). స్టైలీష్ డైరెక్టర్ సుజీత్(Sujeeth) తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీపై ప్రేక్షకుల్లో, మరీ ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి. కెరీర్ లో ఫస్ట్ టైం గ్యాంగ్ స్టార్ పాత్రలో పవన్ కనిపిస్తుండటంతో ఆ అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకుంటున్నాయి. ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేయబోతున్నాం అని చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది.
ఇక ఈ సినిమాలో బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హస్మీ విలన్ రోల్ లో కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక నేడు(మార్చ్ 24) ఆయన పుట్టినరోజు సందర్బంగా ఓజీ నుండి ఇమ్రాన్ హస్మీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో ఆయన ఒమీ భావు అనే డాన్ పాత్రలో కనిపించనున్నాడు. నోట్లో సిగరెట్, చేతిలో లైటర్, వెలికి టాటూతో చాలా స్టైలీష్ గా ఉన్న ఈ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Gambheeraaaa, Nuvvu thirigi Bombay vasthunnaavani vinnaa!! Promise, Iddari lo oka thala ye migultundi…#TheyCallHimOG@PawanKalyan #Sujeeth @priyankaamohan @iam_arjundas @MusicThaman @dop007 @NavinNooli @DVVMovies @SonyMusicSouth #FireStormIsComing pic.twitter.com/jfdhKsmQt8
— Emraan Hashmi (@emraanhashmi) March 24, 2024
ఇదిలా ఉంటే.. ఇదే పోస్టర్ ను ఇమ్రాన్ హస్మీ తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. ఓజీ నుండి ఒక పవర్ ఫుల్ డైలాగ్ ను చెప్పాడు.. గంభీరా.. నువ్వు మళ్ళీ ముంబైలో అడుగుపెడుతున్నావ్ అని విన్నా. ప్రామిస్ ఎవరో ఒకరి తలకాయ లేవడం ఖాయం.. అంటూ రాసుకొచ్చాడు. చాలా పవర్ఫుల్ గా ఉన్న ఈ డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ డైలాగ్ చూసి పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. చదువుతుంటేనే.. ఈ రేంజ్ లో ఉందంటే.. రేపు నీ వాయిస్ లో ఏ రేంజ్ లో ఉంటుందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.