చత్తీస్ ఘడ్ లో ఎదురుకాల్పులు: నలుగురు మావోయిస్టులు మృతి

చత్తీస్ ఘడ్ లో ఎదురుకాల్పులు: నలుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్ గఢ్ దంతారీ జిల్లా అటవీ ప్రాంతంలో స్పెషల్ ప్రోటేక్షన్ ఫోర్స్, నక్సల్స్ కు మధ్య శనివారం ఉదయం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు  మావోయిస్టులు చనిపోయారు. ఇందులో ముగ్గురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. ఘటనా స్థలంలో ఎనిమిది తుపాకులను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

ఖల్లారీ, మేచ్చా గ్రామాల మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో ప్రత్యేక భద్రతా దళాలు గాలింపు జరుపుతుండగా.. వారికి నక్సలైట్లు ఎదురుపడ్డారని చత్తీస్ ఘడ్ డీజీపీ సుందర్ రాజ్ తెలిపారు. ఇరువురికి జరిగిన కాల్పులలో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు చెప్పారు. మరి కోంతమంది మావోయిస్టులు.. తప్పించుకు పారిపోయారని ఆయన అన్నారు. ప్రస్తుతం కూంబింగ్ కొనసాగుతుంది.