
మంచిర్యాల: ఛత్తీస్గఢ్లో మరో ఎన్కౌంటర్ జరిగింది. శుక్రవారం( సెప్టెంబర్ 12) జరిగిన ఎన్కౌంటర్ లో కీలకనేతతోపాటు 10 మంది మావోయిస్టులు చనిపోయారు. వారిలో మంచిర్యాల జిల్లాకు చెందిన జాడి వెంకటి అలియాస్ సురేష్ ఉన్నారు.
సురేష్ స్వస్థలం బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామం. నక్సలైటు ఉద్యమాలకు ఆకర్షితులై 30ఏళ్ల క్రితం అజ్ణాతంలోకి వెళ్లిన సురేష్ ఉద్యమంలో చురుకుగా పనిచేస్తున్నారు. భాస్కర్ డివిజన్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు సురేష్. శుక్రవారం ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయారు.
►ALSO READ | కుషాయిగూడలో దారుణం..అందరూ చూస్తుండగానే రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య
మృతిచెందిన మావోయిస్టు సురేష్ భార్య ఆవుల బాలమల్లు కూడా దండకారణ్యంలో కమిటీ సభ్యులుగా పనిచేస్తున్నారు. జాడి వెంకటి మృతితో చంద్రవెల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.