- ఎన్ కౌంటర్ అంటే ఫ్యాషన్ అయ్యింది
- మావోయిస్టులతో చర్చలు జరపాలి
- ఇవి ప్రభుత్వ హత్యలు: సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని
హైదరాబాద్: పోలీసులు మావోయిస్టులను పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపుతున్నారని, ఎన్ కౌంటర్ చేయండం ఒక ఫ్యాషన్ గా మారిందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని విమర్శించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్ కౌంటర్లు ఆగవని బండి సంజయ్ చెబుతున్నార,ఇ అన్నారు దేశ ప్రధాని పోలీసులకు అభినందనలు చెబుతున్నారని అన్నారు.
పేదల కోసం పనిచేస్తున్న వాళ్లను ఎందుకు చంపుతున్నారని ప్రశ్నించారు. హిడ్మా లొంగిపోతానని చెప్పినా అమిత్ షా వినలేదన్నారు. గతంలో సీపీఐ, సీపీఎం వాళ్లను కూడా హత్య చేశారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే శ్ఉవేత పత్రం విదుదల చేయాలన్నారు. ఎన్ కౌంటర్లపై న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఇవి ప్రభుత్వం చేస్తున్న హత్యలన్నారు.
ఈ మరణాలను కోర్టులు సుమోటోగా తీసుకొని విచారించాలని డిమాండ్ చేశారు. తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్ జీ పోలీసుల అదుపులో ఉంటే వెంటనే చెప్పాలన్నారు. ఈ అంశంపై రేపు ఉదయం 11 గటలకు సీనియర్ మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబోతున్నట్టు చెప్పారు.
