యూఎస్ ఎన్నికలపై స్ఫూఫ్ వీడియో.. కెప్టెన్ అమెరికాగా బైడెన్, థానోస్‌‌‌గా ట్రంప్

యూఎస్ ఎన్నికలపై స్ఫూఫ్ వీడియో.. కెప్టెన్ అమెరికాగా బైడెన్, థానోస్‌‌‌గా ట్రంప్

న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఆసక్తి నెలకొంది. ఎలక్షన్ రిజల్ట్స్‌‌లో డొనాల్డ్ ట్రంప్ పై జో బైడెన్ విజయం సాధించి అగ్రరాజ్య ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై ట్విట్టర్‌‌లో సరదా జోక్స్, ఫన్నీ మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. అలాంటి ఓ స్ఫూఫ్ వీడియోనే అవేంజర్స్ అసెంబుల్. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన అవెంజర్స్: ఎండ్‌‌గేమ్ సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశాన్ని ట్రంప్ మీద బైడెన్ పోరుగా ఓ స్ఫూఫ్ వీడియో రూపొందించారు.

ఈ వీడియోలో బైడెన్ తన మద్దతుదారులతో ట్రంప్ పై యుద్ధానికి వెళ్తున్నట్లుగా చూపించారు. బైడెన్‌‌ను కెప్టెన్ అమెరికా పాత్రలో ఆయన మద్దతుదారులను మిగిలిన అవెంజర్స్ పాత్రల్లో చూపించారు. ట్రంప్‌‌ను  థానోస్ పాత్రలో క్రియేట్ చేశారు. తాను ఎన్నికల్లో గెలిచానని ట్రంప్ అనగానే.. షటప్ అని బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని వీడియోలో చూడొచ్చు. ఫాల్కన్ పాత్రలో కమలా హ్యారిస్, బ్లాక్ పాంథర్‌‌గా బరాక్ ఒబామా, బెర్నీ శాండర్స్‌‌ను డాక్టర్ స్ట్రేంజ్‌‌ రోల్‌‌లో చూపించారు. ఈ వీడియోను డైరెక్టర్, ఎడిటర్ జాన్ హ్యాండెమ్ రూపొందించారు. ప్రస్తుతం నెట్‌‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరూ చూసేయండి.