భారత్ మోడల్తో బాల్య వివాహాలకు ముగింపు

భారత్ మోడల్తో బాల్య వివాహాలకు ముగింపు

న్యూఢిల్లీ: బాల్య వివాహాలకు చరమగీతం పాడాలని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ (యూఎన్‌‌జీఏ) ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. ఈ నెల 25న గురువారం యూఎన్​జీఏలో జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ (జెఆర్‌‌సీ) సంస్థ ‘‘క్రియేటింగ్ ఏ చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ వరల్డ్” అనే అంశంపై సదస్సు నిర్వహించింది.

ఇందులో సంస్థ ఫౌండర్, సుప్రీంకోర్టు న్యాయవాది భువన్ రిభు మాట్లాడుతూ  బాల్య వివాహాలా నిరోధానికి భారత్ అనుసరిస్తున్న విధానం ప్రపంచానికి ఆదర్శమని చెప్పారు. 2030 నాటికి ప్రపంచంలో బాల్య వివాహాలకు ముగింపు పలుకుదామని పిలుపునిచ్చారు. తమ సంస్థ ద్వారా భారత్​లోనే కాకుండా నేపాల్, అమెరికా, సియెర్రా లియోన్, కెన్యా లో కూడా అక్కడి ప్రభుత్వాల భాగస్వామ్యంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు.

భారత్‌‌లో గత మూడేండ్లలో అమ్మాయిల బాల్య వివాహాలు 69 శాతం, అబ్బాయిలవి 72 శాతం తగ్గాయని తెలిపారు. రాష్ట్రాల వారీగా చూస్తే అసోంలో 84 శాతం, మహారాష్ట్ర, బిహార్‌‌లో 70 శాతం, రాజస్థాన్ లో 66 శాతం, కర్నాటకలో 55 శాతం తగ్గుదల నమోదైందని వివరించారు. ‘బాల్ వివాహ్ ముక్త్ భారత్’ కార్యక్రమం గురించి దేశంలో 99 శాతం మందికి అవగాహన ఉందన్నారు. 

‘‘3పీస్’’ మోడల్.. ప్రివెన్షన్, ప్రొటెక్షన్, ప్రాసిక్యూషన్‌‌ విధానంలో వాటిని అడ్డుకోవడంపై భారత్ దృష్టి పెడుతుందన్నారు. ‘‘బాల్య వివాహం.. చైల్డ్ రేప్ లాంటిది. దాన్ని శిక్షించాలి” అని రిభు అన్నారు.జేఆర్‌‌సీ ఇప్పటి వరకు 4 లక్షలకు పైగా బాల్య వివాహాలను అడ్డుకుందని, 1.09 లక్షల పిల్లలను హ్యూమన్​ట్రాఫికింగ్ నుంచి కాపాడిందన్నారు. ‘చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ వరల్డ్’ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నదని తెలిపారు.