ఢిల్లీ లిక్కర్ స్కాం..హైదరాబాద్ లో మరోసారి ఈడీ సోదాలు

ఢిల్లీ లిక్కర్ స్కాం..హైదరాబాద్ లో మరోసారి ఈడీ సోదాలు

ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాం కేసులో   మరోసారి ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.  సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఇవాళ ఈడీ ఎంట్రీ ఇవ్వడం కీలకంగా మారింది. దేశవ్యాప్తంగా 30కి పైగా  ప్రాంతాల్లో ఒకేసారి ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, బెంగళూరు, లక్నో సహా పలు నగరాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. హర్యానాలోని గురుగ్రామ్‌లోని బడ్డీ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అమిత్ అరోరా, ఢిల్లీలోని జోర్ బాగ్‌లోని వ్యాపారవేత్త సమీర్ మహంద్రు, హైదరాబాద్   కోకాపేటలోని ఓ వ్యాపార వేత్త ఇళ్లల్లో  ఈడీ సోదాలు జరుగుతున్నాయి. 

ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధం ఉన్నట్లుగా అనుమానిస్తున్న అధికారులు, లిక్కర్ సిండికేట్ వ్యాపారుల ఇండ్లు, ఆఫీసుల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరిన్ని ఆధారాల వేట కోసం ఈడీ రంగంలోకి దిగినట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ మంత్రి మనీష్ సిసోడియాతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొందరి ఇండ్లల్లో సోదాలు కూడా జరిగాయి.