ENG vs AFG: తేలిపోయిన బజ్‌బాల్ వీరులు.. ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఇంగ్లాండ్ ఓటమి

ENG vs AFG: తేలిపోయిన బజ్‌బాల్ వీరులు.. ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఇంగ్లాండ్ ఓటమి

వారం రోజులు గడిచినా.. వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో పసలేదనుకున్నారా! ఈ టోర్నీలో అసలు పోరు ఇప్పుడు మొదలైంది. డిఫెండింగ్ ఛాంపియన్స్, బజ్‌బాల్ వీరులం అని గొప్పలు చెప్పుకునే ఇంగ్లాండ్ జట్టుకు పసికూన ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు భారీ షాకిచ్చింది. 69 పరుగుల తేడాతో చిత్తు చేసి.. టైటిల్ రేసులో తాము ఉన్నామంటూ మేటి జట్లకు హెచ్చరికలు పంపింది.  

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌ 49.5 ఓవర్లలో 284 పరుగుల వద్ద ఆలౌట్‌ అయ్యింది. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ (80; 57 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సులు) మెరుపులు మెరిపించగా.. మరో ఓపెనర్ ఇబ్రహీం జాడ్రన్ 28, ఇక్రం అలిఖిల్ 58, ముజీం ఉర్ రెహ్మాన్ 28 పరుగులు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఆదిల్‌ రషీద్‌ 3 వికెట్లు తీసుకోగా.. మార్క్‌ వుడ్‌ 2, టాప్లే 1, లియామ్‌ లివింగ్‌స్టోన్‌ 1, జో రూట్‌ 1 వికెట్ పడగొట్టారు. 

బ్రూక్‌ ఒంటరి పోరాటం

అనంతరం 285 పరుగుల ఛేదనలో బజ్‌బాల్ హీరోలు చతికిలపడ్డారు. హ్యారీ బ్రూక్‌ (66) మినహాఅందరూ చేతులెత్తేశారు. బెయిర్‌స్టో (2), మలాన్‌ (32), రూట్‌ (11), బట్లర్‌ (9), లివింగ్‌స్టోన్‌ (10), సామ్‌ కర్రన్‌ (10), వోక్స్‌ (9).. ఇలా ఒకరివెంట మరొకరు పెవిలియన్ చేరారు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వచ్చిన ఇంగ్లాండ్.. 40.3 ఓవర్లలో 215 పరుగుల వద్ద తమ పోరాటన్ని ముగించింది. ఆఫ్ఘనిస్తాన్‌ బౌలర్లలో ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌, రషీద్ ఖాన్ చెరో 3 వికెట్లతో ఇంగ్లాండ్ ను దెబ్బకొట్టారు.