IND Vs ENG 1st Test: ఉప్పల్ టెస్టులో టీమిండియా ఓటమి

IND Vs ENG 1st Test: ఉప్పల్ టెస్టులో టీమిండియా ఓటమి

ఉప్పల్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమిపాలైంది. ఇంగ్లాండ్ నిర్ధేశించిన 231 పరుగుల ఛేదనలో 202 పరుగులకే  కుప్పకూలి.. 28 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. వికెట్ కీపర్ బ్యాటర్ భరత్, ఆల్ రౌండర్ అశ్విన్ వీరోచితంగా పోరాడుతూ టెస్ట్ మ్యాచ్ ను ఆసక్తికరంగా మార్చేశారు. 119 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా వెళ్తున్న టీమిండియాకు భరత్, అశ్విన్ గెలుపుపై ఆశలు చిగురించేలా చేశారు. 8వ  వికెట్ కు వీరిద్దరూ అజేయంగా 57 పరుగులు జోడించి పోటీలో ఉంచారు. 

నాలుగు ఓవర్లలో మ్యాచ్ ముగుస్తుంది అనుకున్న సమయంలో ఇంగ్లాండ్ విజ్రంభించి మిగిలిన మూడు వికెట్లను చక చక పడగొట్టింది. భరత్ టామ్ హార్టిలి క్రీజ్ లో కుదురుకున్న భరత్ ను బౌల్డ్ చేసి మ్యాచ్ ఇంగ్లాండ్ వైపు తిప్పాడు. దాదాపు రెండు గంటల సేపు క్రీజ్ లో ఉన్న లోకల్ కుర్రాడు 59 బంతుల్లో 3 ఫోర్లతో భరత్ 28 పరుగులు చేశాడు. అయితే ఈ దశలో ఆదుకుంటాడనుకున్న అశ్విన్ స్టంపౌటయ్యాడు. దీంతో భారత్ విజయం ఖరారైపోయింది. ఒక్క వికెట్ మాత్రమే ఉండడంతో అంపైర్లు మ్యాచ్ ను పొడిగించడంతో చివరి వికెట్ గా సిరాజ్ వెనుదిరిగాడు. 

నాలుగో రోజు టీ విరామానికి 3 వికెట్లను 95 పరుగులతో పటిష్టంగా కనిపించిన రోహిత్ సేన ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే నాలుగు వికెట్లను కోల్పోయింది. అక్షర్ పటేల్(17), రాహుల్(22), జడేజా(2), శ్రేయాస్ అయ్యర్(13) పెవిలియన్ కు క్యూ కట్టారు. ఇంగ్లీష్ స్పిన్నర్ హార్టిలి 7 వికెట్లు తీసుకొని భారత పరాజయానికి కారణమయ్యాడు. రెండో ఇన్నింగ్స్ లో 196 పరుగులు చేసిన పోప్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో ఇంగ్లాండ్ 5 టెస్టుల సిరీస్ లో 1-0 ఆధిక్యం లభించింది. రెండో టెస్ట్ ఫిబ్రవరి 2 న విశాఖపట్నంలో జరుగుతుంది.