
ఒకే దేశం.. ఒకే ప్రవేశ పరీక్ష.. విధానాన్ని అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. నీట్ తరహాలోనే ఇంజినీరింగ్ పరీక్షను కుడా జాతీయ స్థాయిలో ఒకే ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని భావిస్తోంది. ఇటీవల భువనేశ్వర్ లో జరిగిన ఐఐటీ కౌన్సిల్ మీటింగ్ లో ఈ అంశం చర్చకు వచ్చింది.
నిట్ తరహాలో ఇంజినీరింగ్ పరీక్ష నిర్వహణ సాధ్యమేనా అనే కోణంలో అధ్యయనం చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులకు సూచించారు. ఇప్పటికే సెంట్రల్ వర్సిటీల్లో డిగ్రీ, పీజీ సీట్ల భర్తీకి సీయూసెట్ ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
2023-24 విద్యాసంవత్సరం నుంచి 57 కేంద్ర, రాష్ట్ర విద్యాసంస్థల్లో ప్రవేశపెట్టనున్న 4ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ సీట్లను కూడా జాతీయ ప్రవేశపరీక్ష ద్వారానే నింపుతామని ఇప్పటికే కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది.