
టీమిండియాతో లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. బుమ్రా 5 వికెట్లతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్ లో ఆతిధ్య జట్టు 387 పరుగులకు ఆలౌట్ అయింది. 104 పరుగులు చేసి రూట్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. జెమీ స్మిత్ (51), కార్స్ (56) హాఫ్ సెంచరీలు చేసి రెండో రోజు కీలక ఇన్నింగ్స్ ఆడితే పోప్ (44), స్టోక్స్ (44) రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టాడు. నితీష్, సిరాజ్ రెండు వికెట్లు తీసుకోగా జడేజాకు ఒక వికెట్ దక్కింది.
7 వికెట్ల నష్టానికి 346 పరుగులతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్.. ఈ సెషన్ లో మరో 44 పరుగులు చేసి చివరి మూడు వికెట్లను కోల్పోయింది. లంచ్ తర్వాత జెమీ స్మిత్ (51) ను సిరాజ్ ఔట్ చేశాడు. దీంతో 8 వ వికెట్ కు 85 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత వెంటనే ఆర్చర్ (4) ను బుమ్రాను బౌల్డ్ చేశాడు. స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోవడంతో 355 పరుగుల వద్ద ఇంగ్లాండ్ 9 వికెట్ కోల్పోయింది. చివరి వికెట్ కు కార్స్ మెరుపులు మెరిపించాడు. బషీర్ తో కలిసి కొన్ని బౌండరీలు కొట్టి స్కోర్ ను ముందుకు తీసుకెళ్లాడు.ఈ క్రమంలో కార్స్ తన హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. 55 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కార్స్ (56) ను సిరాజ్ బౌల్డ్ చేసి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ను ముగించాడు.
251 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ కు మంచి ఆరంభం లభించలేదు. తొలి బంతికే రూట్ ఫోర్ తో తన టెస్ట్ కెరీర్ లో 37 వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 88 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ప్రమాదకరంగా మారుతున్న రూట్, స్టోక్స్ జోడీని విడగొట్టి టీమిండియాకు బుమ్రా బ్రేక్ ఇచ్చాడు. 86 ఓవర్ రెండో బంతికి ఒక ఇన్ స్వింగ్ తో స్టోక్స్ (44) ను బుమ్రా బోల్తా కొట్టించాడు. 88 ఓవర్ తొలి బంతికి సెంచరీ హీరో రూట్ ఔటయ్యాడు. బుమ్రా బంతిని డ్రైవ్ చేయాలనీ భావిస్తే ఇన్స్ సైడ్ ఎడ్జ్ తీసుకొని క్లీన్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత బంతికే వోక్స్ వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
►ALSO READ | IND vs ENG 2025: బుమ్రా అడ్డుపడినా స్మిత్ ఆదుకున్నాడు.. లార్డ్స్ టెస్టులో భారీ స్కోర్ దిశగా ఇంగ్లాండ్
మొదట వోక్స్ ను అంపైర్ నాటౌట్ అని ప్రకటించినా.. టీమిండియా రివ్యూ తీసుకొని సఫలమైంది. సిరాజ్ ఓవర్లో స్మిత్ ఇచ్చిన ఈజీ క్యాచ్ ను రాహుల్ చేజార్చడంతో టీమిండియాకు మరో వికెట్ మిస్ అయింది. 271 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ ను కార్స్, స్మిత్ ఆదుకున్నారు. వీరిద్దరూ భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ లంచ్ వరకూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. వీరిద్దరి జోడీ 8 వ వికెట్ కు అజేయంగా 82 పరుగులు జోడించడం విషయం.
Carse is the final man to fall, England are all out for 387!https://t.co/dp3RtHo2QM | #ENGvIND pic.twitter.com/JIuf9iXYx5
— ESPNcricinfo (@ESPNcricinfo) July 11, 2025