Cricket World Cup 2023: టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న ఇంగ్లాండ్ .. కెప్టెన్ లేకుండానే దక్షిణాఫ్రికా

Cricket World Cup 2023: టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న ఇంగ్లాండ్ .. కెప్టెన్ లేకుండానే దక్షిణాఫ్రికా

వరల్డ్ కప్ లో బ్లాక్ బస్టర్ మ్యాచుకు రంగం సిద్ధమైంది. పవర్ హిట్టర్లతో నిండిన దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఈ వరల్డ్ కప్ ఆడిన మూడు మ్యాచుల్లో ఇంగ్లాండ్ ఒక్క విజయం సాధిస్తే.. దక్షిణాఫ్రికా రెండు మ్యాచులో నెగ్గింది. రెండు జట్లు కూడా తమ చివరి మ్యాచుల్లో ఓడిపోయారు. దీంతో ఈ మ్యాచులో పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తుంది.

ఇక ఈ మ్యాచులో ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా.. గాయం నుంచి కోలుకొని తుది జట్టులో స్థానం దక్కనుంచుకున్నాడు  స్టార్ ప్లేయర్ బెన్ స్టోక్స్. ముంబైలోని వాంఖడే స్టేడియం ఈ మ్యాచుకు వేదిక కానుంది.  

Also Read :- పాండ్యా వచ్చే వరల్డ్ కప్ లో ఆడతాడా లేదా

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI):

క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, కగిసో రబడా, లుంగీ న్గిడి

ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI):

జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్, వికెట్ కీపర్), డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, గుస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, రీస్ టాప్లీ