తొమ్మిదేళ్ల తర్వాత సొంతగడ్డపై తిరుగులేని విజయం

తొమ్మిదేళ్ల తర్వాత సొంతగడ్డపై తిరుగులేని విజయం

టెస్టుల్లో నెంబర్ వన్‌గా ఉన్న న్యూజిల్యాండ్‌ను మూడు టెస్టు మ్యాచ్ లలో చిత్తుచిత్తుగా ఓడించి సిరీస్ ను కైవసం చేసుకుంది ఇంగ్లండ్. దీంతో తొమ్మిదేళ్ల తర్వాత సొంతగడ్డపై తిరుగులేని టెస్టు సిరీస్ విజయాన్ని అందుకుంది. 2013లో ఇంగ్లండ్ జట్టు సొంతగడ్డపై చివరగా టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా 3 టెస్టు మ్యాచ్ లు ఆడిన కివీస్ జట్టు ఒక్కటంటే ఒక్క టెస్టు మ్యాచ్ గెలవలేదు. కనీసం డ్రా కూడా చేసుకోలేకపోయింది. మూడో టెస్టులో ఐదో రోజున రూట్ (86 నాటౌట్), బెయిర్‌స్టో (71 నాటౌట్) అద్భుతంగా రాణించి ఆ జట్టును విజయతీరాలకు చేర్చారు. మొత్తం మూడు టెస్టులలో కలిపి రూట్ (396 పరుగులు) జానీ బెయిర్‌స్టో (394 పరుగులు) చేసి అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశారు.