IND vs ENG: మాకు మీ ఫుడ్ వద్దు..స్పెషల్ చెఫ్‌ను వెంట తెచ్చుకుంటున్న ఇంగ్లాండ్

IND vs ENG: మాకు మీ ఫుడ్ వద్దు..స్పెషల్ చెఫ్‌ను వెంట తెచ్చుకుంటున్న ఇంగ్లాండ్

భారత్ వేదికగా ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌ భారత్‌లో పర్యటించనుంది. జనవరి 25 నుంచి ఈ టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ పర్యటనలో ఇంగ్లాండ్ జట్టు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు కనిపిస్తుంది. ఇందులో భాగంగా మాంచెస్టర్ యునైటెడ్ చెఫ్ ఒమర్ మెజియాన్‌ను ఇంగ్లాండ్ స్క్వాడ్ తో పాటు భారత్ కు తీసుకురానున్నారు. డిసెంబర్ 2022లోనూ బెన్ స్టోక్స్ సారధ్యంలోనూ ఇంగ్లాండ్ జట్టు ఒమర్ మెజియాన్‌ను పాకిస్థాన్ కు తీసుకొని వెళ్లారు.  

“ఏడు వారాల పర్యటనలో ఆటగాళ్లు అనారోగ్యం బారిన పడకుండా చూసేందుకు ఈ నెలాఖరున ఇంగ్లండ్ తమ సొంత చెఫ్‌ను భారత్‌కు తీసుకెళ్తుంది. ఆటగాళ్ల పోషణలో అగ్రగామిగా ఉండే ప్రయత్నంలో చెఫ్ జనవరి 25న జరిగే తొలి టెస్టుకు ముందు హైదరాబాద్‌లో జట్టులో చేరతాడు ” అని ది టెలిగ్రాఫ్ పేర్కొంది. ఆటగాళ్లు పిజాలు తినడం కంటే పోషకాహారానికే ప్రాధాన్యత ఇవ్వాలని ఇంగ్లాండ్ క్రికెట్ నొక్కి చెప్పింది.  

ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్టు హైదరాబాద్ లో జరగనుంది. విశాఖపట్నం, రాజ్‌కోట్, రాంచీ, ధర్మశాలలో వరుసగా 2,3,4,5 టెస్టులు ఆడాల్సి ఉంది. గత నెలలో ఇంగ్లాండ్ జట్టును ప్రకటించగా.. త్వరలో భారత జట్టుకు ఎంపిక చేస్తారు. ఇప్పటికే బజ్ బాల్ ను కొనసాగిస్తామని చెప్పిన ఇంగ్లీష్ జట్టు భారత్ ను బయపెడుతుందో లేకపోతో వారు తీసుకున్న గోతిలో వారే పెడతారేమో చూడాలి.